ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం జనవరి నెలలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయోపరిమితి పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వయోపరిమితిని 42సంవత్సరాలకు పెంచగా ఆ జీవో గడువు కొన్ని రోజుల క్రితం ముగిసింది. 
 
సాధారణ పరిపాలన శాఖ వయోపరిమితి పెంపు కొరకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అధికారికంగా త్వరలో వయోపరిమితి పెంపు గురించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగులు వయోపరిమితిని పెంచటం వలన తమకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఎక్కువ మందికి ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల 30వ తేదీతో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపు ఉత్తర్వుల గడువు ముగిసింది. ప్రస్తుతం 42 ఏళ్లకంటే అదనంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు వయోపరిమితి పెంచే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. 
 
వైసీపీ ప్రభుత్వం 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేయటంతో పాటు గ్రామ సచివాలయాలను నెలకొల్పి 1,26,728 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం వయోపరిమితి పెంపు గురించి నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. కొత్త నోటిఫికేషన్ల జారీకి ముందే వయోపరిమితి పెంపు గురించి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వయోపరిమితిని ఏ మేరకు సడలించాలనే అంశం గురించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: