తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సతీమణి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి లోకేష్, జూనియర్ ఎన్టీయార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చేసిన తరువాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ గురించి చెబుతూ నారా లోకేష్ జూనియర్ ఎన్టీయార్ కు భయపడుతున్నారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 
 
జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే విధంగా వంశీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నారా లోకేశ్, జూనియర్ ఎన్టీయార్ గురించి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న సమయంలో లక్ష్మీపార్వతి తన ఇద్దరు మనవళ్ల గురించి ఒక మీడియా ఇంటర్వూలో స్పందించారు. నారా లోకేశ్ ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మీద బలవంతంగా రుద్దుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. మీ మనవడు లోకేశ్ పై ప్రేమ లేదా...? అనే ప్రశ్నకు వాళ్లకు ఉందా ప్రేమ..? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. 
 
60 సంవత్సరాల వయస్సు దాటిన తనపై భయంకరమైన నిందలు సృష్టించినవాడు మనవడు ఎలా అవుతాడు..? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గత 5సంవత్సరాలలో దారుణంగా పరిపాలన చేశాడని లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్క పథకం అయినా సరిగ్గా అమలు చేసిందా...? అని లక్ష్మీపార్వతి  ప్రశ్నించారు.  
 
నారా లోకేష్ ది చీప్ మెంటాలిటీ అని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు పుత్రునిపై ప్రేమతో తెలుగుదేశం పార్టీని భుస్థాపితం చేయడానికి సిద్ధపడ్డాడని లక్ష్మీపార్వతి అన్నారు. లోకేష్ నాకు మనవడు అనే పదాన్ని వినటానికి కూడా బాధ కలుగుతోందని లక్ష్మీపార్వతి అన్నారు. జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం  పార్టీని  కాపాడతారని తాను చెప్పలేనని కానీ లోకేష్ కంటే జూనియర్ ఎన్టీయార్ 100 రెట్లు బెటర్ అని లక్ష్మీపార్వతి అన్నారు. జూనియర్ ఎన్టీయార్ కు నటన, ప్రజలను మెప్పించే నటనా చాతుర్యం, మంచి భాష, మంచి వాక్ చాతుర్యం ఉన్నాయని లక్ష్మీపార్వతి అన్నారు. రాసిచ్చేది ఒకటి ఐతే లోకేష్ చెప్పేది మరొకటి అని లక్ష్మీపార్వతి చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: