ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రం ఉద్యోగాలు ఇలా ఎక్కడ అంటే అక్కడ ఎలాగోలా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ఇప్పుడు మరోసారి నిరుద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించాడు. 


అదేంటంటే.. ఆంధ్రలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో జోన్ల వారీగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 


ఈ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల మొత్తం పోస్టులు 1113 ఉండగా ఏడాది కాంట్రాక్టు వ్యవధి ఉంది. అయితే ఈ పోస్టులకు బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ అర్హత. వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సి, ఎస్టీ అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలులోపు  ఉండాలి. కాగా ఈ పోస్టులకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు 300 రూపాయిలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ పోస్టులకు మినహాయింపు ఉంది. 


కాగా ఈ పోస్టులకు రాతపరీక్ష ద్వారా నియామకం ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 10న ఆన్‌లైన్ పరీక్ష. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. రాత పరీక్షల్లో అర్హత సాధించినవారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు. 2020 జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియామకం ఉంటుంది. ఈ పోస్టులకు నెలకు 25 వేలు జీతం. 


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఈ నెల 17వ తేదీన ప్రారంభమయ్యింది. అలాగే ఈ నెల 29న దరఖాస్తుకు చివరితేది, కాగా ఈ పోస్టులకు వచ్చేనెల అంటే డిసెంబర్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించిన వారికీ డిసెంబర్ 23న బ్రిడ్జ్ కోర్సు కౌన్సిలింగ్ ఉంటుంది. ఆతర్వాత వెంటనే జనవరి 1, 2020లో కోర్సు ప్రారంభమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: