గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా లోకేష్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రి పదవిని ఇచ్చారు.  అయితే, 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.  అయితే, ఎమ్మెల్సీ పదవి ఉండటంతో అయన అసెంబ్లీ వెళ్తున్నారు.  ఇదిలా ఉంటె, తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్ నేతలు పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. 


కారణం ఏంటి అంటే, లోకేష్ ను చూపిస్తున్నారు.  లోకేష్ వలన పార్టీ నాశనమై పోతుందని, అయన హవా ఎక్కువైందని, లోకేష్ ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడుతున్నాడని, అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నామని అంటున్నారు చాలామంది.  ఇక ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు కుమారుడిగానే లోకేష్ కు పేరున్నది.  సొంతంగా ఇమేజ్ ఏమైనా ఉన్నదా అంటే అదేమీ లేదని స్పష్టంగా అర్ధం అవుతున్నది.  


ఎన్టీఆర్ మనమడు అంటే, లక్ష్మి పార్వతికి కూడా మనమడే కదా.  ఇదే విషయాన్ని ఆమె ముందుకు తీసుకొస్తే.. లోకేష్ నాకు మనమడు ఏంటి అని అంటోంది.  తన మీద అనేక నిందలు వేయించిన వ్యక్తి లోకేష్ అని, అలాంటి వ్యక్తి నాకు మనమడు ఎలా అవుతారని, అసలు అలా వినడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదని లక్ష్మి పార్వతి పేర్కొన్నది.  లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని చెప్పింది.  అదే విధంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కాపాడతాడా అని అడిగితె.. 


కాపాడతాడు అని పెద్ద మాట వాడలేము.  కానీ, లోకేష్ కంటే కూడా ఎన్టీఆర్ చాలా బెటర్.  వందశాతం ఎన్టీఆర్ చాలా బెటర్.  తన దగ్గర టాలెంట్ ఉన్నది.  ఆకట్టుకునే తత్త్వం ఉన్నది. ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ అలానే మాట్లాడతాడు.  మాట్లాడబోయే సబ్జక్ట్ గురించి బాగా తెలుసుకొని మాట్లాడతాడు.  ఆకట్టుకునే విధంగా మాట్లాడతాడు. లోకేష్ కంటే నూటికి నూరు పాళ్ళు ఎన్టీఆర్ బెటర్ అని చెప్పింది లక్ష్మి పార్వతి.  లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ ను మార్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడని ఎద్దేవా చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: