ఢిల్లీ ప్రజలు కాలుష్య కోరల్లో బతుకుతున్నారు. దేశంలో మామూలుగానే అన్ని రాష్ట్రాల్లో కంటే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం  ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆ కాలుష్యం తీవ్రత కాస్త ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ నివసించడాని గొప్ప విషయంగా భావించే ప్రజలు ఇప్పుడు ఢిల్లీ కి వెళ్ళాలి అంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం తీవ్రంగా పెరిగిపోయిన కాలుష్యం. మొన్నటి వరకు దేశంలోనే అత్యంత కాలుష్యం ఉన్న రాష్ట్రంగా ఉన్న ఢిల్లీ.... మొన్న పెరిగిన కాలుష్య తీవ్రతతో  ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వాయుకాలుష్యం ఉన్న రాష్ట్రం గా మారిపోయింది. దీంతో ఢిల్లీ ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యంతో అక్కడ గాలి లో కనీసం ఆక్సిజన్ శాతం కూడా ఎక్కువ లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఢిల్లీలో కాలుష్యం పొగ మంచు పేరుకుపోయినట్లు పేరుకుపోయింది. 

 

 

 

 దీంతో ఢిల్లీ రాష్ట్రంలో కూడా ప్రజలకు గాలి పీల్చె వారికీ  చివరకు ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చి  వేధిస్తున్నాయి. పొగ వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా ఢిల్లీ  రాష్ట్రంలో ఎక్కువయ్యాయి.  దీంతో సరి బేసి సంఖ్య విధానాన్ని ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడంతో విద్యాసంస్థకు  సెలవులు  ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్య తీవ్రత రోజురోజుకు తగ్గుముఖం పడుతుందని అధికారులు ఊహించారు  కానీ  కాలుష్య తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ఢిల్లీ లో నివసించే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంటే తాము బతికేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలకు ప్రతి సంవత్సరం నవంబరు 1 నుంచి 20 వరకు ఒక మంచి సెలవులు ఇవ్వాలని కోరుతున్నాను. 

 

 

 

 దీనిపై ఢిల్లీ,  ఎన్సీఆర్ ప్రాంతాల్లో సర్వే చేయగా 74 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కోరారు. పాఠశాలకు సెలవు ప్రకటించడం వల్ల మిగతా సమయాల్లో  సెలవులు తగ్గిస్తూ కవర్ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా చేస్తే విద్యార్థుల విద్య,  ఆరోగ్యం పైన ఎలాంటి సమస్య ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే  వేర్వేరు సమయాల్లో చాలా రోజులు స్కూలుకు సెలవులు ప్రకటించారు. ఇప్పటివరకు ఇలా ప్రకటించిన సెలవులకి భర్తీ ప్రక్రియ మాత్రం చేపట్టలేదని. దీంతో ఈ సంవత్సరం తమ పిల్లల చదువుపై సెలవులు  ప్రతికూల ప్రభావం చూపుతాయని విద్యార్థుల  తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: