గ్యాస్ లైన్ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో పాతిక మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ పైపు లైను పేలుడులో ఏడుగురు వ్యక్తులు మరణించిన దుర్ఘటన మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగర సమీపంలోని జరిగింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగర సమీపంలోని ఓడరేవు సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.


బంగ్లాదేశ్ ఓడరేవు సమీపంలోని పతోర్ ఘాట్ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ పైపులైను పేలింది. ఈ పేలుడులో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ లైను పేలుడు ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ గ్యాస్ లైన్ పేలుడు అక్కడ భీతావహ దృశ్యాలను సృష్టించింది. అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భూకంపం వచ్చిందేమో అనుకుని భయాందోళనలకు లోనయ్యారు.


ఈ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే.. గ్యాస్ పైపులైను పేలుడు ధాటికి సమీపంలోని ఓ ఐదు అంతస్తుల భవనం నిట్ట నిలువునా కుప్ప కూలిపోయింది. ఈ దారుణమైన గ్యాస్ పైపులైను ఘటనకు గ్యాస్ లీకేజీ కారణమని భావిస్తున్నారు. గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించిందని బంగ్లాపోలీసులు చెబుతున్నారు.


అక్కడికక్కడే ఏడుగురు మరణించారంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. గాయపడిన వారి పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చిట్టగాంగ్ పోలీసు క్యాంపు సబ్ ఇన్ స్పెక్టరు అలహుద్దీన్ మియా మీడియాకు వివరాలు చెప్పారు.


మరోవైపు ఈ దారుణ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ పైపులైను నిర్వహణ లోపం వల్లనే పేలుడు జరిగిందని మండిపడుతున్నారు. గ్యాస్ లైన్లను సరిగ్గా మెయింటైన్ చేయకుండా ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: