టీడీపీ నేత బోండా ఉమా సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.విజయ సాయిరెడ్డి లేవనెత్తిన విషయాన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందంటూ.. అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. బిగ్ బ్రేకింగ్ అంటూ తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో త్వరలో జగన్ బెయిల్ రద్దు అవుతుందని.. సీబీఐ ప్రస్తుతం అదే యోచనలో ఉందంటూ సంచలన పోస్ట్ చేశారు.


ఇటీవల సీఎం వైఎస్ జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టు లో పిటిషన్ దాఖలు చెయ్యగా దాన్ని సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఇక సీఎం జగన్ ప్రతీ వారం కోర్టు కు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బోండా ఉమా చేసిన పోస్ట్ వైస్సార్సీపీ శ్రేణుల్ని కలవర పెడుతోంది. సుదీర్ఘ కాలంగా బెయిల్ పొందిన వారందరికీ.. బెయిల్ రద్దు చేసి వెంటనే జైలుకు పంపాలని సుప్రీం కోర్టు సీబీఐని కోరిందంటూ ప్రచారం చేస్తున్నారు. 4 వారాల గడువులోగా వీళ్లను జైళ్లకు పంపాలని సీబీఐ కోరిందని.. ఈ జాబితాలో జగన్ పేరు కూడా ఉందని సోషల్ మీడియా లో ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయ్.


చోటా నాయకులు కాకుండా బోండా ఉమా లాంటి నాయకుడే జగన్ జైలు కు వెళ్తారు అంటూ పోస్ట్ చేయడం తో టీడీపీ శ్రేణులు కూడ జగన్ మళ్ళీ జైలు కు వెళ్లడం ఖాయం అని లెక్కలు కడుతున్నారు. అయితే మరో వైపు వైస్సార్సీపీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక టీడీపీ ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేస్తోంది అని ఆరోపించారు. ఈ పోస్ట్ తో ఏపీ లో టీడీపీ మరియు వైసీపీ మధ్య ఎంత పొలిటికల్ హీట్ ఉందో చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: