ఏం కొట్టాడురా వాడు.. ఎదో మొక్కకు అంటూ కడుతున్నట్టు.. గోడ కడుతున్నట్టు ఎంత శ్రద్దగా కట్టాడురా.. మగాడంటే ఆడురా బుజ్జా.. అనే డైలాగ్ గుర్తుంది కదా.. అతడు సినిమాలో తనికెళ్ళ భరణి మహేష్ బాబు గురించి చెప్తాడు.  ఇదే డైలాగును ఇప్పుడు కొద్దిగా మార్చుకోవచ్చు.  ఎవరైనా సరే సాహసం చేసి, ప్రాణాలను లెక్క చేయకుండా ధైర్యంగా ఏవైనా పనులు చేస్తే.. మగాడంటే ఆడురా అని చెప్పొచ్చు.  


ఇలా చెప్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు.  చాలా కష్టపడాలి.  ధైర్యం కావాలి.  కేవలం కండబలం ఉంటేనే సరిపోతూ.. గుండెధైర్యం కూడా ఉండాలి.  అలాంటి గుండెధైర్యం ఉన్న వ్యక్తి ఒకరు ఇటీవలే కనిపించాడు.  అతను ఎవరూ ఏంటి అనే విషయాలు తెలియదు.  కానీ, ఆ వ్యక్తి చేసిన పనిని బట్టి చూస్తే.. నిజంగా గుండె ధైర్యం కలిగిన వ్యక్తిలానే కనిపిస్తున్నారు.  ఎవరైనా బోనులో ఉండే సింహం దగ్గర వెళ్లి నిలబడి ఫోటో దిగాలి అంటే భయపడతారు.  


ఇక సింహం పెద్దగా అరిస్తే గుండెలు గుభేలు అంటాయి.  సింహం ఫుల్ గా తిని పడుకున్నప్పుడు దాని ముందు ఎన్ని ఎదవ వేషాలు వేసిన పట్టించుకోదు.. అదే ఆకలేసినపుడు ముందుకెళ్లి నిలబడితే ఏనుగునైనా సరే చంపేస్తుంది.  మరి ఆ సింహాలు ఆకలిమీద ఉన్నాయో లేదో తెలియదుగాని ఓ వ్యక్తి వాటి ముందుకు వెళ్లి ధైర్యం గా పడుకున్నాడు. 


అలా పడుకోవడమే అక్కడే ఫోటోలు దిగాడు.  ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  ఈ సంఘటన గుజరాత్ లోని గిర్ అడవుల్లో జరిగింది. ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.  ఒకవేళ ఆ సింహాలు వారినేమైనా చేశాయా ఏంటి అనే విషయం గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.  ప్రస్తుతం దీనిని సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: