జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిపక్షాలు ట్రాప్ లో ఇరుక్కున్నారా ? జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. పరిపాలనా పరంగా తాము ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా జగన్ లెక్క చేయటం లేదని ప్రతిపక్షాలకు అర్ధమైపోయింది. దాంతో తెలుగుదేశంపార్టీ బ్రహ్మాండమైన స్కెచ్ వేసింది. అదే హిందువుల మనోభావాలను జగన్ కించపరుస్తున్నారనటం.

 

ఇందుకు నాంది పలికింది చంద్రబాబునాయుడే. అయితే చంద్రబాబు ఆరోపణలకు కూడా జగన్ స్పందించలేదు. దాంతో ఓ పద్దతి ప్రకారం తమ నేతలతో పదే పదే తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రస్తావనలోకి తెస్తున్నారు. దాంతో వైసిపి ట్రాప్ లో పడినట్లే అర్ధమవుతోంది.

 

తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వెళ్ళినపుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదన్నది చంద్రబాబు ఆరోపణ. నిజానికి చంద్రబాబు ఆరోపణలు అసంబంద్ధం. అన్యమతస్తులైన విదేశీయులు, లేదా ప్రముఖులు తిరుమల దర్శనానికి వచ్చినపుడు శ్రీవారిపై నమ్మకం ఉందని చెప్పే డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టటం ఆనవాయితి.

 

అయితే చంద్రబాబు చంద్రబాబు అండ్ కో చెబుతున్న డిక్లరేషన్ జగన్ కు వర్తించదు. ఎందుకంటే జగన్ ఏపిలోనే పుట్టి ఇక్కడే పెరిగారు. గతంలో కూడా ఎన్నోసార్లు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అప్పుడెప్పుడూ ఎదురుకాని డిక్లరేషన్ సమస్య ఇపుడే ఎందుకు మొదలైంది ? పైగా డిక్లరేషన్ ప్రస్తావన వైఎస్సార్ ఉండగా ఎవరు ఎందుకు మాట్లాడలేదు ?

 

ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబులో అభద్రత పెరిగిపోతోంది. ఓ పదిమంది ఎంఎల్ఏలు టిడిపికి రాజీనామా చేస్తే చంద్రబాబుకు ప్రధాన  ప్రతిపక్షనేత హోదా కూడా పోతుంది. దాంతో  కావాలనే జగన్ ను బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశ్యంతోనే తిరుమల ఆలయం డిక్లరేషన్ ప్రస్తావన పట్టుకొచ్చారు.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు జగన్ తిరుమల డిక్లరేషన్ పట్టించుకోలేదు.

 

అలాగే ఏ నేతను కూడా ఆ విషయం పట్టించుకోవద్దని జగన్ ఆదేశించుండాలి. మరి తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ అనేక విషయాల్లాగే తిరుమల గురించి కూడా  కొడాలి ఘాటుగా స్పందించారు. టిడిపికి కావాల్సింది కూడా అదే. అందుకనే జగన్ ను అంతలా రెచ్చగొట్టింది. చంద్రబాబుపై విరుచుకుపడిన కొడాలి తిరుమల పవిత్రతను కానీ భక్తుల మనోభావాలను ఎక్కడా ప్రస్తావించలేదు.

 

 అయినా భక్తుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ టిడిపి నేతలు నానా యాగీ చేస్తున్నారు.  తిరుమల విషయంలో చంద్రబాబు చేసిందే పనికిమాలిన ఆరోపణలు. దాన్ని పట్టుకుని  రచ్చ మొదలుపెట్టిందంటే  టిడిపికి కావాల్సిందదే కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: