కర్ణాటక రాష్ట్రంలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి దేవరాజ్ అనే వ్యక్తి కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు యువతి తండ్రి దేవరాజ్ వీరిద్దరి వివాహానికి ఒప్పుకోలేదు. వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని దేవరాజ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దేవరాజ్ పెళ్లికి ఒప్పుకోకపోవటంతో మంజునాథ్ దేవరాజ్ కూతురు ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తరువాత మండ్యలో మంజునాథ్ అతని భార్య కాపురం పెట్టారు. సెప్టెంబర్ నెల 9వ తేదీన వీరి వివాహం జరిగింది. కానీ కొన్నిరోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన మంజునాథ్ ఇంటికి తిరిగిరాలేదు. భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మంజునాథ్ భార్య సమీపంలోని పోలీస్ స్టేషన్ లో భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని మంజునాథ్  కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మంజునాథ్ అదృశ్యమైన కొన్ని రోజుల తరువాత హోళెనరసిపుర సమీపంలోని హేమావతి కాలువలో ఒక మృతదేహం లభించింది. పోలీసులు ఆ మృతదేహం గురించి ఆరా తీయగా ఆ మృతదేహం అదృశ్యమైన మంజునాథ్ మృతదేహం అని పోలీసులు గుర్తించారు. కత్తులతో పొడిచి మంజునాథ్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో ఒక గ్యాంగ్ 5లక్షల రూపాయలు తీసుకొని హత్య చేశారని మంజునాథ్ మామ దేవరాజ్ 5 లక్షలు సుపారి ఇచ్చాడని తేల్చారు. 
 
పోలీసులు మంజునాథ్ హత్య కేసులో దేవరాజ్ తో పాటు మరో 5మందిని అరెస్ట్ చేశారు. దేవరాజ్ పోలీసులకు తన కూతురు అన్న వరుసయ్యే వ్యక్తి పెళ్లి చేసుకోవటంతో సమాజంలో తన పరువు పోయిందని అందువలన హత్య చేయించానని చెప్పాడు. పోలీసులు దేవరాజ్ తో పాటు సంజయ్, నందన్, చెలువ, మంజు, యోగేష్ ను అరెస్ట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: