ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి.  రాజధాని అమరావతిని ఏర్పాటు చేసి అక్కడ ప్రస్తుతం సచివాలయం, సెక్రటేరియట్, హైకోర్టును ఏర్పాటు చేశారు.  అక్కడి నుంచే ప్రస్తుతం సాధారణ పరిపాలన, కోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి.  అయితే, అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా, నిర్మాణాలను ఆపేసింది.  నిర్మాణాలు ఆగిపోవడమే కాకుండా, అమరావతి విషయంలో సింగపూర్ స్టార్ట్ అప్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవడంతో.. రాజధాని విషయంలో వైకాపా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలియక ఇబ్బందులు పడ్డారు.  


అయితే, అమరావతి విషయంలో ప్రభుత్వం జీఎన్ రావు కమిటీని వేసింది.  ఏ కమిటీ నివేదికను బట్టి రాజధాని నిర్మాణం ఎక్కడ చేపట్టాలో ప్రభుత్వం తెలియజేస్తుంది.  అయితే, ఏ కమిటీ చేసిన సూచనల మేరకు కర్నూలులోని ఓర్వకల్లు దగ్గర భూములను సిద్ధం చేయాలని అధికారులకు సూచించడం హాట్ టాపిక్ గా మారింది.  ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ను ఆధునీకరించాలని, ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో అందుబాటులో ఉన్న భూములను సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించడంతో రాజధాని మారబోతుందా అనే డౌట్ ఏర్పడింది.  


అయితే, గత కొంతకాలంగా కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి.  హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయకుంటే ఉద్యమం చేస్తామని ఇప్పటికే చాలామంది బయటకు వచ్చారు.  బహుశా వాటిని దృష్టిలో పెట్టుకొని కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయబోతున్నారా అన్నది చూడాలి.  ఒకవేళ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. రాజధాని ఎక్కడ ఉంటుంది.  అమరావతిలోనే రాజధాని ఉంటుందా లేదంటే అక్కడి నుంచి మారుస్తారా..?


జీఎన్ రావు కమిటీ ప్రస్తుతం కర్నూలులో పర్యటిస్తోంది.  కలెక్టర్, ఎస్పీతో సమావేశం అయ్యారు.  ఈ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. ఓర్వకల్లు చుట్టుపక్కల భూముల గురించి ఆరా తీయడంతో పాటుగా, అక్కడ శ్వాశ్వత రక్షిత మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ చెప్పడంతో .. ఆ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.  మరి చూద్దాం ఏం జరుగుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: