భారతదేశ అతి పురాతన వివాదమైన అయోధ్య పై సుప్రీం కోర్టు ఇటీవలే సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చిన స్థలంలో పురాతన ఆలయం ఉండేదని పురావస్తు శాఖ ఇచ్చిన ఆధారాలతో సంతృప్తి చెందిన న్యాయస్థానం అక్కడ రామ మందిర నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. మసీదును నిర్మించడానికి వీలుగా అయోధ్యలో మరో చోట ఐదెకరాల స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 


తాజాగా, ఈ తీర్పు పట్ల ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సుప్రీం లో రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించింది. ‘‘ఆలయాన్ని కూల్చి మసీదు కట్టినట్టు సుప్రీం చెప్పలేదు. మసీదును మాకు ఇవ్వలేదు. కాబట్టి రివ్యూ పిటిషన్ వేసే హక్కు మాకుంది’’ అని జమియత్ ఉలామా ఐ హిందీ అధ్యక్షుడు అర్షద్ మదానీ తెలిపారు. నవంబర్ 9న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్వాగతించింది. తాము రివ్యూ పిటిషన్‌ వెయ్యట్లేదని చెప్పింది.

తాజాగా ముస్లిం లా బోర్డు రివ్యూ పిటిషన్‌ అంశాన్ని సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ చూసుకోబోతున్నారు. రివ్యూ పిటిషన్స్ ఏం చెబుతున్నాయ్ 
రివ్యూ పిటిషన్స్ ను కోర్టు సమర్ధించవచ్చు లేదంటే కొట్టివేయవచ్చు. అయోధ్య తీర్పు ని అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఏకాభిప్రాయంతో వెలువరించారు. ఒక వేళ రివ్యూ పిటిషన్ వేస్తే ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారించే అవకాశం ఉంది. ఒక వేళ కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇస్తే ప్రస్తుత తీర్పు నిలిచిపోయి ఆలయ నిర్మాణం పనులు ఆగిపోతాయి.

మళ్ళీ అయోధ్య వివాదం మొదటికి వస్తుంది. రివ్యూ పిటిషన్ వేసాక తీర్పు ఏడాది లోనే రావొచ్చు లేదా పది సంవత్సరాలు పట్టొచ్చు తీర్పు ఎప్పుడు వస్తుంది అన్న విషయం పై మనం స్పష్టత ఇవ్వలేము. ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పై దేశం మొత్తం చర్చ నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: