మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేయటానికి ఇండియన్ బ్యాంకు రంగం రెడీ చేసింది. డిసెంబర్ 20వ తేదీన గంటాకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు చేసిన ప్రకటన ఇపుడు సంచలనంగా మారింది. బిజినెస్ కోసం బ్యాంకు నుండి తీసుకున్న అప్పులు చెల్లించనందుకు గంటా ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు డిసైడ్ అయ్యింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అప్పుడెప్పుడో ఇండియన్ బ్యాంకు నుండి బిజినెస్ కోసమని గంటా అండ్ కో 200 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారట. అయితే తీసుకున్న అప్పును ఎంత కాలానికి తీర్చలేదు. అప్పు తీర్చే విషయమై గంటాకు నోటిసులిచ్చినా ఆయన పట్టించుకోలేదు. దాంతో వేరే దారి లేక గంట ఆస్తులను అటాచ్ చేసుకుంటున్నట్లు నోటిసిచ్చింది. దానికి కూడా గంటా నుండి సమాధానం లేదని సమాచారం.

 

దాంతో చేసేది లేక గంటా ఆస్తుల విషయంలో అంటే తనఖా పెట్టిన ఆస్తుల వేలంపై బ్యాంకు బహిరంగ ప్రకటన చేసింది. అయినా పట్టించుకోకపోవటంతో చివరకు డిసెంబర్ 20వ తేదీన తనఖా పెట్టిన ఆస్తులను బహిరంగంగా వేలం వేయనున్నట్లు ప్రకటన జారీ చేసిందట.

 

అంతా బాగానే ఉంది కానీ తీసుకున్న అప్పేమో సుమారు రూ. 200 కోట్లు. తనఖా పెట్టిన ఆస్తి విలువేమో సుమారు 35 కోట్లు. ఈ రెండింటికి ఏమన్నా పొంతనుందా అసలు ? అప్పు ఇచ్చే ముందే తనఖా పెట్టిన ఆస్తుల విలువ గురించి బ్యాంకు అధికారులు చూసుకున్నారా ?  తీసుకున్న అప్పుకన్నా తనఖా పెట్టిన ఆస్తుల విలువ తక్కువగా ఉన్నపుడు అస్తులను వదులుకోవటానికే ఎక్కువ అవకాశాలు. కాబట్టి ఆస్తులను వేలం వేయటం వల్ల గంటాకు వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే పరువునష్టం గురించే ఆలోంచాలి. పరువు గురించే ఆలోచించేట్లుంటే అసులు పరిస్దితి ఇంతదాకా తెచ్చుకునే వారేనా ?


మరింత సమాచారం తెలుసుకోండి: