తీవ్ర నేరాలు పెరిగిపోవ‌డానికి ప్రేమ‌లు...వివాహేత‌ర సంబంధాలే ప్ర‌ధాన‌కార‌ణమ‌వుతున్నాయి. ఇటీవ‌ల నేష‌న‌ల్ క్రైమ్ బ్యూరో వెల్ల‌డించిన రికార్డుల్లో ఇదే విష‌యం ప్ర‌స్పుట‌మైంది. గ‌తంలో ప‌గ‌లు..విద్వేషాలు..ఇలా వివిధ కార‌ణాల‌తో హ‌త్య‌లు జ‌రిగేవ‌ని, కాని కొద్ది సంవ‌త్స‌రాలుగా ప్రేమ‌లు..వివాహేత‌ర సంబంధాల విష‌యంలో హ‌త్య‌లు చేసే సంస్కృతి పెరుగుతూ వ‌చ్చిన‌ట్లు నివేదిక‌లో పేర్కొంది. . ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలేనని తేల్చింది. క్రైం బ్యూరో వెల్ల‌డించిన గ‌ణంకాలు స‌మాజ ధోర‌ణుల‌కు అద్దం ప‌ట్టేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.


నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2001లో దేశావ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదు అయ్యాయని... అవి 2017 సంవత్సరానికి వచ్చే సరికి 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదు అయినట్టు తెలిపింది. మరోవైపు వ్యక్తిగత కక్ష్యతో చేసే హత్యలు కూడ 2001 సంవత్సరంతో పోల్చితే... 4.3 శాతం తగ్గాయని నివేదికలో పేర్కోంది.. ఇక ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యల సంఖ్య కూడా 12 శాతం తగ్గినట్టు చెప్పింది. అయితే ప్రేమ వ్యవహారాలు మరియు వివాహేతర సంబంధాల వల్లే 28శాతం హత్యలు జరుగుతున్నాయని వెల్లడైంది. వందలోపు పరువు హత్యలు కూడ నమోదు అయినట్టు చెప్పింది.


 నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదికల్లో వెల్లడించిందిప్రేమ హత్యలు జరిగిన మొదటి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రేమ వ్య‌వ‌హారాలు.. ప్రేమ వివాహాలు... ఆత‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో  హత్యలు జరిగినట్టు నివేదిక‌లో పేర్కొంది. ఇక  ప్రేమ వ్యవహారాల్లో వివాహేతర సంబంధాల వ‌ల్ల జ‌రిగిన హత్యలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మారుతున్న మ‌నుషుల ఆలోచ‌న దృక్ప‌థానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని సామాజిక వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: