కొన్నిరోజుల క్రితం తమిళనాడులో విలక్షణ నటుడు కమల్ హాసన్ 65వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కమల్ హాసన్ పుట్టినరోజు వేడుకలకు కమల్ చిరకాల మిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. చెన్నై నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉంగళ్ నాన్ అనే పేరుతో కమల్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ కమల్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 60 సంవత్సరాలు అయిందని అన్నారు. 
 
కమల్ కు మద్దతు తెలుపుతూ రజనీకాంత్ కొందరు రాజకీయనాయకులపై సెటైర్లు వేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ కు మాత్రమే ఎన్నో ట్యాలెంట్లు కనబరిచే ప్రతిభ ఉందని రజనీకాంత్ అన్నారు. కమల్ హాసన్ ఎన్నో త్యాగాలు చేశాడని, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడని 60 సంవత్సరాలు చిత్రపరిశ్రమలో కొనసాగటం అంత తేలిక కాదని రజనీకాంత్ అన్నారు. కమల్ అంత కష్టాలు తాను కూడా పడలేదని కమల్ నటనను చూసి సంతోషించేవాడినని రజనీకాంత్ అన్నారు. 
 
చాలామంది కమల్ హాసన్ మాటలు అర్థం కావని చెబుతూ ఉంటారని నాకు కమల్ హాసన్ మాటలు అర్థం అయినపుడు మీకు ఎందుకు అర్థం కావని రజనీకాంత్ అన్నారు. మా ఇద్దరి అభిమానులు స్నేహంగా ఉండాలని నేను కోరుకుంటానని మా ఇద్దరి మధ్య స్నేహాన్ని ఎవరూ విడగొట్టలేరని రజనీకాంత్ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రెండు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అవుతాడని కలలో కూడా ఊహించి ఉండడని రజనీకాంత్ అన్నారు. 
 
పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చాలా మంది  మూడు, నాలుగు నెలల్లో పళనిస్వామి ప్రభుత్వం కూలిపోతుందని అంచనా వేశారని రజనీకాంత్ అన్నారు. కానీ అద్భుతం జరిగినట్లు పళనిస్వామి పాలన అందరికీ నచ్చిందని రజనీకాంత్ అన్నారు. అద్భుతాలు గతంలో జరిగాయని ప్రస్తుతం జరుగుతున్నాయని భవిష్యత్తులో కూడా జరుగుతాయని రజనీకాంత్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: