వైసిపిలో కొత్తగా కొందరు ఫైర్ బ్రాండ్లు పుట్టుకొస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రాబాబునాయుడు అండ్ కో మీద కానీ పవన్ కల్యాన్ మీద కానీ ఆరోపణలు, విమర్శలు చేయటంలో వైసిపిలో కొందరు నేతలుండేవారు. రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈ పద్దతిలోనే చాలా పాపులరయ్యారు. రోజా దెబ్బను తట్టుకోలేకే చివరకు అసెంబ్లీ నుండి ఏకంగా ఏడాదిపాటు సస్పెండ్ చేసి టిడిపి ఊపిరి పీల్చుకుంది.

 

సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకనో వైసిపి నుండి చంద్రబాబు, టిడిపి, పవన్ నుండి వస్తున్న ఆరోపణలు, విమర్శలకు ధీటుగా వైసిపి నుండి  పెద్దగా కౌంటర్లు రావటం లేదు. అదే సందర్భంలో ప్రభుత్వం చేసుకుంటున్న మంచిపనులను కూడా చాలా మంది మంత్రులు సక్రమంగా చెప్పుకోలేకపోయింది కూడా వాస్తవమే.

 

సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే వైసిపి తరపున ఇద్దరు ముగ్గురు ఫైర్ బ్రాండ్లు హఠాత్తుగా పుట్టుకొచ్చారు. వాళ్ళే మంత్రలు కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపిఐఐసి ఛైర్ పర్సన్ అయిన తర్వాత రోజా ఎందుకు మీడియా ముందుకు రావటం తగ్గించేశారు. ఆ వెలితిని పార్టీ తరపున ఎవరూ భర్తీ చేయలేకపోయారు. అయితే మూడు నాలుగు రోజులుగా కొడాలి నాని మీడియా సమావేశాలు చూసిన తర్వాత కొడాలిలో ఇంత ఫైర్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

 

ఇసుక సమస్య, తిరుమల శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ అంశం, టిడిపిలో అంతర్గత సమస్యలపై సెటైర్లు వేయటం ఇలా ప్రతి అంశంపైనే కొడాలి నాని చంద్రబాబుతో పాటు దేవినేని ఉమ, యనమల రామృష్ణుడు, నారా లోకేష్ లాంటి వాళ్ళను దుమ్ము దులిపేశారు.

 

కాకపోతే చంద్రబాబు, ఉమపై మాట్లాడినపుడు కాస్త డోస్ ఎక్కువైంది. లుచ్చాగాడు, పెద్ద లుచ్చా అనే పదాలు రాకుండా జాగ్రత్త పడితే మాత్రం కొడాలి నోటికి అడ్డుందని అర్ధమైపోయింది. అలాగే అసేక సబ్జెక్టులపై కన్నబాబు, వెల్లంపల్లి కూడా బాగానే మాట్లాడారు. కాబట్టి వైసిపిలో కొత్తగా ఫైర్ బ్రాండ్లు పుట్టుకొచ్చినట్లే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: