మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి విదితమే. కొన్ని టీవీ ఛానల్లో మరియు బహిరంగంగానే తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగిన ఈయన తెలుగుదేశం పార్టీని వదిలి జగన్ మోహన్ రెడ్డి యొక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్న విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వల్లభనేని వంశీ తెలుగుదేశం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ పార్టీ వారిపై ఘాటైన విమర్శలు చేస్తూ వారికి సంబంధించిన లోగుట్టు వ్యవహారాలను ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తే అది ఆడకూడదు అని.... ఓపెనింగ్స్ అస్సలు రాకూడదు అని కొబ్బరికాయలు కొట్టే వాళ్ళని వంశీ సదరు టీవీ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఘోరమైన పరాభవం చవిచూసిందో తమ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చి వారి పార్టీ ఇంకా బలోపేతం అవుతుందని భావిస్తున్నారు కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ఎలా ఉండేది అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యి నష్టాలు మిగల్చాలి అని కోరుకునే వారంట.


వంశీ చెప్పిన ఈ మాటలతో తెలుగుదేశం పార్టీ స్థాయి మరింత దిగజారగా ఇప్పటివరకు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో తారక్ అభిమానులంతా తమ ఆగ్రహాన్ని టీడీపీ నాయకుల పై వెళ్లగక్కుతున్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి మరియు జూనియర్ ఎన్టీఆర్ కు కోల్డ్ వార్ నడుస్తోంది అన్న విషయం అందరి నోళ్లలో నానుతున్నా కొంతమంది మాత్రం ఇవన్నీ కేవలం ఉదంతాలు అని కొట్టిపారేశారు. మరి ఇప్పుడు వంశీ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత వారంతా ఏమంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: