గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి రోజూ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం..అతి వేగం ఇలా రోడ్డు  ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు తీసుకువస్తున్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎంతో మంది వాహనాలు సీజ్ చేస్తున్నారు...మైనర్లకు వారి తల్లిదండ్రుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. 


కానీ, కొంత మంది చేస్తున్న పొరపాటు వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది అంగవైకల్యంతో బాధలు పడుతున్నారు..ఎంతోమంది అనాథలుగా మిగిలిపోయారు.  ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నా..అతి వేగాన్ని మాత్రం అధిగమించలేకపోతున్నారు. 


తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్ జిల్లా శ్రీదంగర్‌గఢ్ సమీపంలో బస్సు-లారీ ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు.


రోడ్డు ప్రమాదం జరిగిన స్థలంలో బాధితుల ఆర్తనాధాలతో హృదయవిదారకంగా ఉంది.  మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే  ఈ ప్రమాదం ఎలా జరిగింది..అతివేగమే కారణమా..లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరింగా? ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: