దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటివరకు ఉల్లి వైపు  చూడాలంటే దేశ ప్రజలందరూ వణికిపోయారు . ఇంకొంత మందైతే ఉల్లి లేకుండానే  ఆహారం తయారు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సామాన్య ప్రజలను కోయకుండానే  కన్నీళ్లు పెట్టించింది ఉల్లిధర . కాగా గత కొన్ని రోజుల నుండి కొంచెంకొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ ఒకటే సారి భారీ స్థాయిలో పెరిగిన ఉల్లి ధర కొంచెం కొంచెంగా తగ్గుతుండటంతో ఉల్లి ధరలో  మాత్రం ఎక్కువ మార్పులు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ సామాన్యులకు ఉల్లి భారంగానే మారిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా కేజీ ఉల్లి ధర 220 రూపాయలు  అయింది. ఏంటి రేట్ చూసి నోరెళ్ళ పెట్టేసారు... అయితే ఈ రేటు మనదేశంలో కాదులేండి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో.  ఇప్పటికే మన దేశంలో ఉల్లి కి దిగుమతి తగ్గి డిమాండ్ పెరిగిపోవడంతో బంగ్లాదేశ్ కి భారత్ నుండి  ఉల్లి ఎగుమతి జరగడంలేదు. 

 

 

 

 దీంతో అక్కడ ఉల్లికీ డిమాండ్  ఏర్పడిపోయింది. అది కూడా మామూలు డిమాండ్ కాదండోయ్...  ఏకంగా ఉల్లి కిలో ధర 220 రూపాయలు  అమ్ముతున్నారు వ్యాపారలు .దీంతో  ఉల్లిపాయలు కొనాలంటే జంకుతున్నారు  సామాన్య ప్రజలు. ఉల్లి  వైపు చూడాలంటేనే వణికిపోతున్నారు. అయితే బంగ్లాదేశ్లో ఉల్లి ధరలు అమాంతం ఆకాశాన్నంటడంతో పలుచోట్ల వినియోగదారులు ఆందోళనలు  కూడా జరుగుతున్నాయి. అయితే ఉల్లిధరపై  స్పందించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. విమానాల ద్వారా  ఈజిప్ట్ చైనాల వంటి దేశాల నుంచి ఉల్లిని బంగ్లాదేశ్ కు  దిగుమతి చేసుకుంటోంది. ఇక ప్రభుత్వం తరఫున పలు చోట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు 38 రూపాయలకు ఉల్లిని అందచేస్తుంది  ప్రభుత్వం. ఉల్లి వాడకంపై తన నివాసంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిషేధం విధించినట్లు తెలిపారు. ఉల్లి  వాడకుండానే వంటలు తయారు  చేసినట్లు వెల్లడించారు. 

 

 

 

 ఇదిలా ఉండగా అటు  మన దేశంలో కూడా ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. మేలురకం ఉల్లి అయితే ఏకంగా 70 రూపాయలు పలుకుతుంది. గత నెల రోజుల నుండి ధరలు ఆకాశాన్నంటుతున్న పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. వర్షం కారణంగా పంటలు దెబ్బతినడంతో ఉల్లి దిగుమతి తగ్గిపోయి బాగా డిమాండ్ ఏర్పడింది.దీంతో  ధరలు పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.కాగా  ఇంకొన్ని రోజుల పాటు ఇదే రకంగా  కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వినియోగదారులు కూడా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ఉల్లిని  తక్కువగానే కొంటున్నారు. దీంతో తమ  వ్యాపారాలు కూడా మందగిస్తున్నాయని  చిరు వ్యాపారులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: