విశాఖపట్నం లోని ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా  అనే కంపెనీ ఆస్తులను జప్తు చేసేందుకు ఇండియన్ బ్యాంక్ సిద్ధమైంది. భారీ మొత్తంలో అప్పులు తీసుకుని చెల్లించక  పోవడంతో ఈ కంపెనీ యొక్క ఆస్తులను జప్తు చేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ కి చెందిన ఆస్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు చెన్నై కాంచీపురం లో ఉన్నట్లు గుర్తించారు ఇండియన్ బ్యాంక్ అధికారులు. కాగా  ఈ ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు అధికారులు. ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ భారీ మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం తో  ఇండియన్ బ్యాంక్ అధికారులు ఆస్తుల జప్తుకు నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఇండియన్ బ్యాంక్ అధికారులు బిట్ లను  ఆహ్వానిస్తున్నారు. 

 

 

 

 అయితే ఈ రుణ గ్రహీతల జాబితా లో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. అయితే ఒకప్పుడు ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా  కంపెనీకి అండగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవడంతో ప్రత్యూష రిసోర్సెస్ అండ్  ఇన్ఫ్రా ఎండి గా గంట శ్రీనివాసరావు తప్పుకున్నారు . అయితే 2016 లోనే ఒక ఫ్లాట్ దస్తావేజులు తనకా  పెట్టి రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా  కంపెనీకి చెందిన ఆస్తులను ఇండియన్ బ్యాంక్ జప్తు చేసింది. కాగా  2006 సంవత్సరంలో 104 కోట్ల రుణాలను తీసుకుంది ప్రత్యూష రిసోర్సుస్ అండ్  ఇన్ఫ్రా కంపెనీ. కాగా రుణాలపై వడ్డీ సహా  ఇతర టాక్స్ లతో కలిపి మొత్తంగా 2019 నాటికి 209 కోట్లకు చేరింది. అయితే ఈ మొత్తంన్ని  చెల్లించకుండా ప్రత్యూష ఇన్ఫ్రా కంపెనీ ఎగ్గొట్టడంతో  ఇండియన్ బ్యాంక్ ఆస్తులు జప్తు చేసినందుకు రంగం సిద్దమయింది . 

 

 

 

 కాగా ప్రత్యుష రిసోర్సుస్ అండ్  ఇన్ఫ్రా కంపెనీ ఇండియన్ బ్యాంకు చెల్లించాల్సిన మొత్తం 209 కోట్లు ఉండగా... కంపెనీ యొక్క మొత్తం ఆస్తుల విలువ 35 కోట్లు మాత్రమే ఉంది. దీంతో సొంత ఆస్తులను జప్తు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది ఇండియన్ బ్యాంక్. అయితే ఈ నెల 20న మొత్తం ఆస్తులను వేలం వేయనుంది ఇండియన్ బ్యాంక్. కాగా  ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ ఇన్ఫ్రా కంపెనీ తనఖా పెట్టిన మొత్తం ఆస్తులను వేలం వేయనుంది . అయితే  రుణ గ్రహీతల జాబితా లో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఉండటం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: