ఈరోజు నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.  ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలు చర్చించాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పటికే చర్చించారు.  అన్ని అంశాలకు సంబంధించిన వాటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కాశ్మీర్ అభివృద్ధి, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన, దేశంలో వివిధ అంశాలపై  ఉన్న సమస్యల గురించి చర్చించబోతున్నారు.  


వీటితో పాటుగా ప్రభుత్వానికి వివిధ పార్టీలు తమ సమ సమస్యల గురించి కూడా విన్నవించారు.  వాటిలో వేటిపై చర్చించాలి అనే అంశాలపై కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.  కాగా, ఈ ఉదయం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ బయట పెద్ద ఎత్తున ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

పెంచిన ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ను ముట్టడించే ప్రయత్నం చేసారు.  వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ యూనివర్శిటీ మెస్, హాస్టల్ ఫీజులను 300శాతం పెంచింది ప్రభుత్వం.  ఇలా మెస్ కు సంబందించిన ఫీజులు పెంచడంతో స్టూడెంట్స్ ఒక్కసారిగా భగ్గుమన్నారు.  గత కొంతకాలంగా దీనిపైనే యూనివర్శిటీలో గొడవలు జరుగుతున్నాయి.  


సాధారణ విద్యార్థులు ఫీజులు కట్టేందుకే ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు హాస్టల్, మెస్ ఫీజులు కూడా పెంచితే స్టూడెంట్స్ కు పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు.  యూనివర్సిటీ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో స్టూడెంట్స్ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం చేశారు.  అయితే, పార్లమెంట్ ముట్టడి చేసినంత మాత్రనా ఫీజులు తగ్గుతాయా అన్నది తెలియాలి.  ఇలా విలువైన సమయాన్ని ఈ పోరాటం చేయడానికి వినియోగించే బదులుగా చక్కగా చదువుపై దృష్టి సారిస్తే బాగుంటుంది కదా.   విద్యార్థులు ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్ నుంచి భారీ ఎత్తున లాంగ్ మార్చ్ చేస్తూ పార్లమెంట్ వరకు వెళ్లారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: