ఎప్పుడు ఎదో ఒక వివాదాలలో తలా దురుసు శ్రీరెడ్డి మొత్తానికి  పక్కా ప్లానింగ్‌తో పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో హైదరాబాద్ నుండి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి.. అక్కడ సినిమాల్లో ట్రై చేస్తూనే పొలిటికల్ ఎంట్రీకి వయా చెన్నై దిశగా ట్రాక్ వేసుకుంది.

తమిళ తలైవా రజినీకాంత్ పార్టీలోకి వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నానంటూ ఈ మధ్య కాలంలో పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి.. ‘ఇదేమీ సినిమా కాదు రజినీకాంత్ గారూ.. సస్పెన్స్ మెయింటెన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీరు పార్టీ పెడితే నేను జాయిన్ అవుతా’ అంటూ మనసులో కోరికను బయటపెట్టేసింది.
అయితే అందరిలా సింపుల్‌గా వెళ్లి ఏదో పార్టీలో జాయిన్ అయిపోతే ఆమె శ్రీరెడ్డి ఎందుకు అవుతుంది..


అందుకే తన పొలిటికల్ ఎంట్రీలోనూ వివాదం ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయ్యే పనిలో ఉన్న శ్రీరెడ్డి.. తమిళ రాజకీయాలపై గురిపెట్టి తొలి అడుగులోనే ప్రకంపనలు రేపింది.కరుణానిధి మనవడు, ప్రస్తుతం డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌పై శ్రీరెడ్డి పేరుతో సన్సేషనల్ పోస్ట్‌ వైరల్ అయ్యింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో విశాల్ ద్వారా స్టాలిన్‌ను గ్రీన్ పార్క్ హోటలో‌లో కలిసానని, ఆ రాత్రంతా ఇద్దరం లైంగికంగా కలిసామని ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.

అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది.అయితే శ్రీరెడ్డి ఉదయనిధిపై చేసిన ఆరోపణలపై ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. శ్రీరెడ్డి చెన్నైలో కనిపిస్తే చంపేస్తాం అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన శ్రీరెడ్డి.. అసలు విషయాన్ని బయటపెట్టింది.ఈ ఇష్యూపై చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించిన శ్రీరెడ్డి.. ‘నేను ఉదయనిధిని ఎప్పుడూ కలవలేదని.. అది ఫేక్ పోస్ట్’ అంటూ బాంబ్ పేల్చింది.


ఆ పోస్ట్ ఆమె అధికార ఫేస్‌బుక్‌ ఖాతాది కాదని.. . కావాలనే ఎవరో పనిగట్టుకుని శ్రీరెడ్డి పేరుతో ఆ పోస్ట్ పెట్టి కుట్ర చేస్తున్నారని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. అసలు ఉదయనిధి స్టాలిన్‌ను నేను ఎప్పుడూ నేరుగా చూసింది లేదని.. ఆయనపై నేను చేసినట్టుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కుండబద్దలు కొట్టింది శ్రీరెడ్డి. అయితే త్వరలో తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని, తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. మొత్తంగా శ్రీరెడ్డి తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఒక్క పోస్ట్‌తో తమిళ నాట హాట్ టాపిక్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: