ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ ని సొంతం చేసుకుని వైసిపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను గాడిలో పడింది అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ పారదర్శక పాలన అందిస్తూ  అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయిన వెనకాడడం లేదు ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్వన్ స్థానంలో నిలిపేందుకు వినూత్న ఆలోచనలతో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా పారదర్శక పాలన అందిస్తున్నారు . అటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ఎలాంటి అవినీతికి తావులేకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తున్నారూ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చాక చేస్తామంటూ   ఇచ్చిన హామీలను  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వ పాలన మొదలు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన  ఎన్నో హామీలను నెరవేర్చారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ . రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. ప్రభుత్వ అధికారుల్లో  అవినీతిని నిర్మూలించేందుకు నడుంబిగించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 

 ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అవినీతి అంతం చేయడమే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అవినీతి మూలాలు ఎక్కడున్నాయో అని గుర్తించి వాటిని నిర్మూలించేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్. అంతేకాకుండా అధికారుల్లో ఎక్కడ అవినీతి జరుగుతుంది ఎంత అవినీతి జరుగుతుంది అనే అంశాన్ని... గుర్తించి అవినీతికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలనే దానిపై ఐఐఎమ్  అహ్మదాబాద్ నిపుణుల చేత అధ్యయనం చేయించాలని నిర్ణయించింది జగన్ సర్కార్. అయితే నిపుణులు ఇచ్చిన నివేదిక ప్రకారం అసెంబ్లీ సమావేశాల తర్వాత అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా మరోవైపు ఏసీబీని కూడా బలోపేతం చేస్తూ చట్టంలో సవరణలు తీసుకురానుంది జగన్ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: