శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి .... ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేరళ వందల కిలోమీటర్ల దూరం. అయితే ఏపీకి చెందిన కొందరు అయ్యప్ప భక్తులు దూరాన్ని లెక్కచేయక కాలి నడకన శబరి చేరుకుంటారు.  కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు.

కఠిన నియమాలతో, నిష్ఠ‌ల‌తో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతుంటారు. అయితే ప్రతియేటా  తిరుమల నుంచి నెత్తిన ఇరుముడితో నడక సాగిస్తున్న అయ్యప్ప స్వాములకు ఈ సారి ఓ శునకం తోడైంది.  స్వామియే శరణం అయ్యప్పా అంటూ ఆ భక్తుల వెంట ఎలాంటి అలుపూ లేకుండా శునకం ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 480కిలోమీటర్లు నడిచింది. 

అయ్యప్ప భక్తులతో పాటు కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా వరకు చేరింది. తమతో పాటే నడక సాగిస్తున్న శునకానికి ఆహారం అందిస్తున్నారు మాలదారులు. అయితే అలుపెరుగక సాగుతున్న యాత్రలో కుక్క తోడు సరికొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు. ఇదంతా స్వామి అయ్యప్ప మహిమ అంటున్నారు భక్తులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: