తాజాగా ఆంధ్రప్రదేశ్ లో   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నందమూరి లక్ష్మి పార్వతి  ఓ ఇంటర్వూలో కీలక విషయాలను తెలియచేయడం జరిగింది. తనకు ముఖ్యమంత్రి వైయస్  జగన్ మోహన్ రెడ్డి తెలుగు అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మే 30న ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. జగన్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొని  రావడం జరిగింది అని ఆమె పేర్కొన్నారు. నేను  ఎప్పుడూ ఎన్టీఆర్ పాలనను జగన్‌తో పోల్చి చూడను అని అన్నారు.


త్వరలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రెండు విషయాలపై లేఖ రాయనున్నట్లు లక్ష్మి పార్వతి తెలియచేయడం జరిగింది. కృష్ణా జిల్లాకు స్వర్గీయ నందమూరి రామారావు పేరు పెట్టడంతో పాటు,  ఎన్టీఆర్ కు  భరతరత్న ప్రకటించాలని ఆ లేఖలో రాస్తాను అని  తెలియచేయడం జరిగింది. భారతరత్న అంశం కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంది కాబ్బటి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే విషయం జగన్ ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం నాకు ఉంది అని తెలియచేయడం జరిగింది.


ఇంకా  దీంతో పాటు ఆమె తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పై జోస్యం కూడా చెప్పడం జరిగింది. 2022 ఏడాది కల్లా టీడీపీ భూస్ధాపితం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఏ విషయాలపై కనీస అవగాహన లేని నారా లోకేష్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం పై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. లోకేష్ నాయకత్వంలో టీడీపీ ముందుకు పోవడం చాల కష్టమని ఆమె స్పష్టం తెలియచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో  వైయస్ జగన్ పాలనకు ఆమె 100 కు 70  మార్కులు కూడా వేయడం జరిగింది. ఇక జగన్ మోహన్ రెడ్డి పాలన వంద శాతం ఎన్టీఆర్, వైఎస్ఆర్ అడుగుజాడల్లో ముందుకు కొనసాగుతుంది అని లక్ష్మీపార్వతి  తెలియచేయడం జరిగింది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఆ పార్టీ మహిళా నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మార్కులు వేశారు. జగన్ ఐదు నెలల పాలనకు 60 నుంచి 70 మార్కులు ఇవ్వొచ్చన్నారు. కానీ, వైఎస్ పాలనతో పోల్చి చూస్తానని చెప్పారు. ‘జగన్ పాలనను వైఎస్‌తో పోల్చి చూస్తా. ఇప్పటికే ఎన్నో పథకాలు తెచ్చారు. కొన్ని అమలవుతున్నాయి. మిగిలినవి అమలు కావాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: