జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మొదటి నుంచీ గమనించిన వారికి ఆయనలో ఒక కొత్త నాయకుడు కనిపిస్తారు. పార్టీని ప్రారంభించిన తర్వాత రాజకీయాల్లో ఆయనది వినూత్నమైన ఒరవడి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై పవన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడిగా అభిప్రాయం తెలపడం ఆయన హక్కు అని జనసేన నేతలుచెప్పారు.

 

 
 
అయితే పవన్ వ్యక్తిగత విషయాలపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. దీంతో పవన్ కూడా ఘాటుగానే స్పందించడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, దానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పారు పవన్ కల్యాణ్. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన భావించారు. అయితే జగన్ నేరుగా పవన్ పై విమర్శల దాడి మొదలుపెట్టిన తర్వాత కొందరు మంత్రులు కూడా జనసేనపై  ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. దీంతో పవన్ కూడా ఎదురు దాడి మొదలుపెట్టారు. ఇసుక సమస్యపై పవన్ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. అది భారీ స్థాయిలో జరిగింది. ప్రస్తుతం పవన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా జగన్ పై ఒక వ్యంగ్య చిత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది రాజకీయంగా సంచలనం కలిగించింది.

 

 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే జగన్ సంక్షేమ పథంలో దూసుకుపోతున్నారు. అందరికీ అన్నీ అనే విధంగా పథకాలను ప్రకటించారు. అమలు చేయడం మొదలుపెట్టారు. అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో కనీసం 90 శాతం మందికి ఏదో ఒక పథకం కింద లబ్ధి అందేలా చూడాలనేది జగన్ ఉద్దేశం. అందుకే, కొత్త కొత్త పథకాలు శ్రీకారం చుడుతున్నారు. 

 

 
తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించే వారు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం తెలుగు మీడియంలోనే బోధించాలని డిమాండ్ చేయడం ఏమిటని జగన్ ప్రశ్నించారు. నిజంగా ఇది చాలా మందిని ఆలోచింప చేసింది. ఈ డిమాండ్ చేసే వారు తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించాలి కదా అనే చర్చ మొదలైన మాట వాస్తవం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: