తెలుగు రాజకీయాల్లో జంపింగులు సర్వసాధారణమైపోయాయి. ఒకపుడు ఫలనా వారు పార్టీ మారారు అంటే అది సంచలనం. ఇపుడు పార్టీ మారకపోతే విడ్డూరం. ఓ విధంగా డబ్బు రాజకీయాలను శాసిస్తున్న యుగంలో వ్యాపారులు, కార్పొరేట్ శక్తులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత లాభం, నష్టం ఈ రెండే తూకం రాళ్ళుగా మారుతున్నాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు లాభం ఉంటే ఎంతకైనా తెగించేందుకు కూడా నేతలు  రెడీ అయిపోతున్నారు.


ఏపీలో ఓ వైపు టీడీపీని వైసీపీ, బీజేపీ టార్గెట్ చేస్తున్నాయి. వీలైనంతమంది ఎమ్మెల్యేలను కమలం గూటికి చేర్చడానికి పువ్వు పార్టీ పెద్ద స్కెచ్ తో ఏపీలో  సిధ్ధంగా ఉంది. ఓ విధంగా టీడీపీ ఆయువు పట్టు మీద కొట్టాలని బీజేపీ చూస్తోంది. మరో వైపు వైసీపీ కూడా టీడీపీ వైపే బాణాలు వేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు రప్పించడం ద్వారా చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర లేకుండా చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.


ఇవన్నీ ఇలా ఉంటే జాతీయ స్థాయిలో చూసుకుంటే బీజేపీకి జనం బంపర్ మెజారిటీ ఇచ్చారు. కానీ కమలనాధులు ఎక్కడ వీలు చిక్కితే అక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. వారి చూపు ఇపుడు ఏపీ మీద పడిందని అంటున్నారు. ఏపీలో వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరి నుంచి కొంతమందిని తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా ఏపీలో పై చేయి సాధించాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైతే ముగ్గురు ఎంపీల మీద బీజేపీ కన్ను పడిందని  ప్రచారం సాగుతోంది. గోదావరి జిల్లాలకు చెందిన బడా నాయకుడొకరు బీజేపీ వలలో చిక్కారని తెలుస్తోంది. అలాగే రాయలసీమ సరిహద్దు జిల్లాల్లో మరో ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీలో దోస్తీకి  ఉబలాటపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇలా ఎంపీలు మరింతమంది కూడా వస్తే అనర్హత వేటు పడకుండా కమలం శిబిరంలో  చేర్చుకోవచ్చునని చూస్తున్నారుట.


ఈ సంగతి తెలిసిన మీదటనే జగన్ బాగా అలెర్ట్ అయ్యారని అంటున్నారు. జగన్ ఎంపీల సమావేశంలో దిశానిర్దేశం చేస్తూనే ఏ ఒక్క ఎంపీ కూడా కేంద్ర మంత్రులను విడిగా కలవడానికి లేదని ఆదేశాలు జగన్ జారీ చేశారు. విజయసాయిరెడ్డి ఎంపీల వెంట ఉండాల్సిందేనని కూడా జగన్ కచ్చితంగా చెప్పేశారు. అంటే ఎంపీలు గీత దాటుతున్నట్లుగా  కచ్చితమైన సమాచారం వైసీపీ పెద్దల వద్ద ఉందని అంటున్నారు. మరి ఇంత చేసినా కూడా ఎంపీలు చేజారితే మాత్రం అది కమలం పెద్దల మ్యాజిక్ గానే చూడాలని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఒక మాట అన్నారు. వైసీపీ ఎంపీలు పెద్ద సంఖ్యలో బీజేపీలోకి సర్దుకుంటున్నారని. దాని అర్ధం వైసీపీకి బోధపడినా పరమార్ధం తెలియడానికి ఇంకా టైం ఉందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: