రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 250వ సెషన్ జరుపుకుంటున్న రాజ్యసభకు, రాజ్యసభ సభ్యులందరీకీ అభినందనలు తెలిపారు. ఉభయ సభలు చరిత్ర సృష్టించాయని మోదీ అన్నారు. చారిత్రక ఘట్టాలకు రాజ్యసభ సాక్ష్యంగా నిలిచిందని మోదీ అన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యసభ సభ్యునిగానే పార్లమెంట్ కు వచ్చారని మోదీ అన్నారు. 
 
కాలంతోపాటు మారేందుకు రాజ్యసభ కృషి చేస్తోందని మోదీ అన్నారు. గొప్ప నాయకులు రాజ్యసభకు నేతృత్వం వహించారని మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో రాజ్యసభ కీలకంగా వ్యవహరించిందని మోదీ అన్నారు. దేశ ఆర్థిక, సామాజిక పరివర్తనలో రాజ్యసభ కీలకంగా వ్యవహరించిందని మోదీ అన్నారు. 250వ సమావేశాలు జరుగుతున్న ఈ క్షణాలు చారిత్రక క్షణాలు అని మోదీ అన్నారు. ఎంతో దూరదృష్టి కలిగిన సభ రాజ్యసభ అని మోదీ అన్నారు. 
 
ఇక్కడే ఎన్నో బిల్లులు ఆమోదం పొందాయని మోదీ తెలిపారు. రాజ్యసభ దేశానికి మేలు చేయాల్సి వచ్చిన ప్రతి సమయంలోను ఆదుకుంటుందని మోదీ అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌‌, జీఎస్టీ, ట్రిపుల్ తలాఖ్ బిల్లుల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఈరోజు ఉదయం మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విపక్షాలు లేవనెత్తే అన్ని సమస్యల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అన్ని పక్షాలు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని మోదీ కోరారు. 
 
రాజ్యసభకు ఈ సమావేశాలు 250వ సమావేశాలు కావడం విశేషం అని 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని 26వ తేదీన జరుపుకోవటం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఈ సమావేశాలకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయని ఈ సమావేశాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మోదీ అన్నారు. విపక్షాలకు ప్రజాసమస్యలపై కూలంకషంగా చర్చిద్దామని మోదీ పిలుపునిచ్చారు. నాణ్యతతో కూడిన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ప్రజాసమస్యలపై చర్చించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని మోదీ అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: