ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి  ఇద్దరు  గవర్నర్ తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ ను కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరింది. ..ముఖ్యమంత్రి దంపతులు రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులతో కలిసి విందు స్వీకరించారు. ఆ తరువాత రాష్ట్రంలో నెలకొన్ని తాజా పరిస్థితులు..ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు..ప్రతీ అంశం వివాదాస్పదం అవుతున్న తీరు గురించి వివరించినట్లుగా తెలుస్తోంది.


అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తున్న మతపరమైన విమర్శల వెనుక వాస్తవాలను గవర్నర్ కు నివేదించినట్లు సమాచారం. ఇక, ఇదే సమయంలో పలు యూనివర్సిటీలు..ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారం పైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితితో పాటుగా.. ఇసుక సమస్య పరిష్కారం..ఇంగ్లీషు మీడియం నిర్ణయం వంటి వాటి పైన నెలకొన్న వివాదాలు..ప్రభుత్వ ఉద్దేశాలను గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి..కేంద్రం నుండి అందాల్సిన సాయం పైన ప్రస్తావించినట్లు సమాచారం.


పోలవరం ప్రాజెక్టు అంశం..కోర్టుల్లో కేసుల గురించి గవర్నర్ వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం.ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా మతరపరమైన విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. అటు బీజేపీ నేతలు..ఇటు జనసేన..టీడీపీ నేతలు సైతం ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని రాజకీయంగా మతపరమైన విమర్శలు చేస్తున్నారు. తిరుపతిలో బస్ టిక్కెట్ల పైన అన్యమత ప్రచారం అంశం మొదలు..ఇంగ్లీషు మీడియం పాఠశాలల నిర్ణయం వెనుక మత మార్పిడి ఆలోచనలు ఉన్నాయంటూ చేస్తున్న విమర్శల పైన ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.


శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న అన్ని విమర్శలకు ఆధారాలతో సహా ప్రభుత్వం సమాధానం చెప్పటానికి సిద్దం అవుతోంది. రాష్ట్రానికి రాజ్యాంగ బద్దంగా అధిపతి అయిన గవర్నర్ కు సైతం సీఎం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఇక, ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లను మార్చే ఆలోచన చేస్తోంది. యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తారు.


దీంతోఆ అంశాల పైన గవర్నర్ తో భేటీ సమయంలో చర్చకు వచ్చినట్లు గా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారం పైన చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, అధికారులు దీనిని ఎవరూ ధ్రువీకరించటం లేదు. అయితే, ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న పరిణామాల పైన ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు సమాచారం. తాజాగా ఏపీపీఎస్సీ కమిషనర్ గా ఐపీఎస్ అధికారి పీయస్సార్ ఆంజనేయులను ప్రభుత్వం నియమించింది. ఇద్దరు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఛైర్మన్ మార్పు పైన చర్చ సాగుతున్నట్లు ప్రభత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: