ఉత్తరప్రదేశ్ లో ఒక నాలుగేళ్ల పాప చనిపోతే అంత్యక్రియలు చేయద్దు మా పాప బతికొస్తుందని ఆమె తల్లిదండ్రులు గంటలకొద్దీ ప్రార్థనలు చేశారు. కళ్ళ ముందే తన పాప చనిపోతే తట్టుకోలేని ఆ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మౌ జిల్లాలో చోటు చేసుకుంది. అరవింద్ వనవసి అనే వ్యక్తి కూతురు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. అయితే నవంబర్ 14 వ తారీకు ఆమె మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. 


అరవింద్ వనవసి 6 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం లో చేరాడు. అతని చుట్టాలు కూడా క్రైస్తవ మతంలో చేరారు. వాళ్లు అరవింద్ కి... జీసస్ ఫోటో ముందు పాపని ఉంచి ప్రార్థన చేస్తే ఆమె బతికి వస్తుందని చెప్పారు. దాంతో అరవింద్ వనవసి తన కూతురు నిజంగానే బతికొస్తుందేమో అనే ఆశతో ఆ చిన్న పాపకు అంత్యక్రియలు చేయకుండా ఒక బైబిల్, ఒక ఏసుప్రభు ఫోటో ముందు పాప మృతదేహాన్ని పెట్టి ప్రార్థనను తన కుటుంబ సభ్యులతో సహా చేయడం మొదలుపెట్టాడు. చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టాలని అక్కడి వారు ఎంత నచ్చజెప్పినా ఆ తల్లిదండ్రులు వినలేదు. పాప లేస్తుంది అదిగో అంటూ రోదిస్తున్నారు. 


దీంతో ఆ గ్రామానికి చెందిన కొంతమంది .. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య కు ఈ విషయాన్ని తెలియజేశారు. అనురాగ్ ఆర్య ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ని అరవింద వనవసి ఇంటికి పంపించాడు. ఆ ఇన్స్పెక్టర్ వాళ్లకి సర్దిచెప్పి... చివరికి పాప అంత్యక్రియలను సజావుగా సాగేలా చూశాడు.  అరవింద్ వనవసి అనే వ్యక్తి ఇటుకుల బట్టిలో కూలీగా పనిచేస్తున్నాడు. అరవింద ఫ్యామిలీ ఇంకా అతని చుట్టుపక్కల నివసించే వాళ్లంతా ఒక పాస్టర్ చెప్పడంతో క్రైస్తవ మతంలో 6 ఏళ్ల క్రితం చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: