మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పార్టీలు విఫలం కావడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.  దీంతో అన్ని పార్టీలు సమయం దొరికింది.  పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంపై పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి.  చర్చలు జరుపుతున్నాయి.  అయితే, బీజేపీ ఈ విషయంలో కాస్త ఆలోచనలో పడింది.  బీజేపీ ఏం చేస్తున్నది..ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది అనే విషయాలు బయటకు తెలియడం లేదు.  


అంతా కామ్ గా ఉండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై బీజేపీ సుముఖంగా లేదేమో అని మిగతా పార్టీలు అనుకుంటున్నాయి.  అంతా బాగున్నట్టయితే.. బీజేపీ.. శివసేన పార్టీలు కలిసి ఈపాటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి.  కానీ, ముఖ్యమంత్రి పీఠం విషయంలో జరిగిన రగడ కారణంగా రెండు పార్టీలు విడిపోయాయి.  ఇప్పుడు శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసింది.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పై చర్చలు జరుపుతున్నాయి.  


ఈ చర్చలు ఎప్పటికి ఫలిస్తాయి అన్నది తెలియాల్సి ఉన్నది.  తాజా సమాచారం ప్రకారం పవార్ విడివిడిగా ఇప్పటికే విడివిడిగా శివసేన, కాంగ్రే పార్టీ చేతలతో చర్చలు జరిపారు.  ఈ చర్చల సారాంశాన్ని ఈరోజు యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో చర్చలు జరపబోతున్నారు.  రేపటి రోజున మరోసారి మూడు పార్టీల నేతలతో చర్చలు జరిపి.. ప్రభుత్వం ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు.  


ప్రభుత్వం ఏర్పాటు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రి పదవుల పంపకం గురించి ఓ అవగాహనకు వస్తున్నట్టు తెలుస్తోంది.  అవగాహనకు వచ్చిన తరువాత, మరోసారి సోనియాగాంధీతో మాట్లాడి.. ఫైనల్ గా ఓ అవగాహనకు వచ్చి... ప్రభుత్వం ఏర్పాటుకు అడుగు ముందుకు వేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పటి వరకు అంతా అనుకున్నట్టుగానే జరుగుతున్నది. పదవుల పంపకం కీలక వ్యవహారం కాబట్టి దానిపై అవగాహనకు వచ్చిన తరువాతే ఏదైనా జరగొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: