ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆరు నెలలు కూడా అవ్వకనే ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేసి దీక్షలు, లాంగ్ మార్చులు అంటూ కొత్త ప్రభుత్వాన్ని తొక్కేయాలి అని చూసినప్పటికీ... ఇలాంటివి అన్ని మా దగ్గర కుదరవు బాబు అంటూ ఘాటు సమాధానం ఇస్తుంది ప్రభుత్వం. 

        

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రాలో రాజధాని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. రాజధాని అధ్యయన కమిటీ అయిన జీఎన్ రావు కమిటీ కర్నూలు ఎయిర్ పోర్టు సమీపంలో భూములు సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా అధికారులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ హైకోర్టు లేదా రాజధానికోసమే భూములను సిద్ధం చేయమని చెప్పి ఉండవచ్చని కర్నూలు జిల్లా ప్రజలు భవిస్తాన్నారు. 

          

అయితే ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాకు జరిగిన నష్టాన్ని త్వరలోనే తీరుస్తామని కమిటీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాయలసీమ విద్యార్థి, యువజన, జేఏసీ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. 

          

మరో వైపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయం నుంచి రాజధాని మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయినా సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు ఈ కమిటీల కారణంగా మళ్ళి రాజధాని హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: