ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈరోజు హైకోర్టులో జరిగిన విచారణ ముగిసింది. హైకోర్టు తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. పరిధి దాటి ముందుకు వెళ్లలేమని చెప్పిన హైకోర్టు రెండు వారాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ కు  ఆదేశాలు జారీ చేసింది. తమ నుండి ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీసీ వ్యవహారంలో ప్రస్తుతం ప్రభుత్వం కార్మికులపై పై చేయి సాధించింది. 
 
ప్రభుత్వం మొదటినుండి ఈ కేసును కార్మిక శాఖ కమిషనర్ కు కేసును బదిలీ చేయాలని ఏ వాదనను వినిపిస్తోందో ఆ వాదన వైపే ఈరోజు హైకోర్టు మొగ్గు చూపింది. పిటిషనర్ సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపి ఆర్టీసీకి నష్టం కలిగేలా చేస్తున్నాయని అఫిడవిట్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 45వ రోజుకు చేరింది. లాయర్ మాట్లాడుతూ ఈ కేసు హైకోర్టు పరిధిలోకి రాదని కేసు లేబర్ కోర్టు పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. 
 
తాత్కాలిక డ్రైవర్ల వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఒక అజెండా ఉందని ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ ఇచ్చిన అఫిడవిట్ ఒక రాజకీయ పార్టీ నేత ఇచ్చిన అఫిడవిట్ లాగా ఉందని ప్రకాష్ రెడ్డి అన్నారు. కమిటీ వేస్తే సమ్మెపై పునరాలోచిస్తామని ప్రకాష్ రెడ్డి తెలిపారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: