వైసీపీ ఎంపీ .. కీలక నేత అయిన విజయ సాయి రెడ్డి మీద కేంద్ర మంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. చిదంబరం విషయంలో కాంగ్రెస్ అభ్యర్ధనను విజయ సాయి రెడ్డి తప్పు బట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేళ వేధింపులకు గురి చేసి.. కొత్త పార్టీ పెట్టుకునే వరకూ తీసుకెళ్లిన సోనియా.. ఆ తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించారో అందరికి తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి చేసినట్లుగా ఆరోపణలు చేపట్టి.. తమ అధీనంలో ఉన్న సీబీఐని ఉసిగొల్పి పెట్టించిన కేసుల వెనుక అసలు విషయం బహిరంగ రహస్యం.పార్లమెంటు సమావేశాల ప్రారంభమవుతున్న వేళ.. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వినిపించిన వాదనపై అమిత్ షా క్లాస్ పీకినట్లుగా.. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు. 


అయితే విజయ సాయి రెడ్డి వాదనలో తప్పేమి లేదని చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే  విజయసాయి రెడ్డి వాదనను మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నది మర్చిపోకూడదు. వైఎస్ జగన్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ను కేసుల మీద జైలుకు పంపిన యూపీఏ సర్కారు.. ఆయన బెయిల్ మీద విడుదలైన తర్వాత పార్లమెంటుకు హాజరయ్యేందుకు అనుమతించలేదు. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి చిదంబరం మీద కూడా కేసులు ఉన్నాయి. వాటి కారణంగా తీహార్ జైలుకు వెళ్లారు. అలాంటప్పుడు ఆయన్ను పార్లమెంటు సమావేశాలకు హజరయ్యేందుకు అనుమతి ఎలా ఇస్తారు?


అని విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు. అయితే విజయ సాయి రెడ్డి జోక్యం పట్ల అమిత్ షా కు కోపం వచ్చిందని ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే చిదంబరం జైలుకు పంపిన విషయంలో బీజేపీకి జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్న షా.. విజయసాయి రెడ్డి గతాన్ని గుర్తు చేయటం.. అందులో న్యాయం ఉండటంతో దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ జగన్ విషయంలో అన్యాయం జరిగిందన్న మాటను ఒప్పుకుంటే చిదంబరాన్ని అనుమతించలేని పరిస్థితి. చిదంబరాన్ని అనుమతించని పక్షంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అబ్లిగేషన్ ను నో చెప్పలేని దుస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: