ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ సింగపూర్ కంపెనీ రాజధాని స్టార్టప్ ప్రాజెక్టు నుండి పరస్పర అంగీకారంతోనే తప్పుకుందని తెలిపారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ విషయాన్ని స్వయంగా తనతో చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సింగపూర్ కంపెనీకి స్విస్ చాలెంజ్ లో టెండర్లు ఇచ్చారని మంత్రి అన్నారు. మీడియం మాత్రమే ఇంగ్లీష్ చేశామని తెలుగు భాషను తప్పనిసరి చేశామని బొత్స అన్నారు. 
 
మాతృభాషపై మమకారంతో పాటు భృతి, మనుగడ కూడా అవసరమేనని బొత్స అన్నారు. ప్రతిపక్షాలు ఇంగ్లీష్ మీడియంపై గగ్గోలు పెడుతున్నాయని అన్నారు. ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదని ప్రతిపక్షాలు ధైర్యముంటే చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతపురంలో కొత్తగా మూడు మార్కెట్ లను ఏర్పాటు చేస్తామని బొత్స అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స అన్నారు. 
 
అనంతపురంలో గుంతకల్లు, కదిరిలో ఒక మార్కెట్ కమిటీ ఉన్నా మరో మార్కెట్ కమిటీ వస్తుందని మొత్తం 16 మార్కెట్ కమిటీలు అనంతపురంలో ఉంటాయని బొత్స అన్నారు. వైసీపీ ప్రభుత్వం మొదటినుండి రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం పథకంతో కలిపి ఇస్తుందని అసెంబ్లీలోనే చెప్పిందని బొత్స అన్నారు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు కూడా అమలు చేయటంతో కౌలు రైతులు అభినందనలు తెలిపారని బొత్స అన్నారు. 
 
సీఎం జగన్ వీవోఏలకు 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారని హామీ నెరవేర్చామని బొత్స అన్నారు. సీఎం జగన్ నిర్ధిష్టమైన ఆలోచనతో, దీర్ఘకాలిక ప్రయోజనాలతో పథకాల అమలు చేస్తారని బొత్స అన్నారు. ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అయిందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది మా విధానం అని ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పామని అదే విధంగా ముందుకెళుతున్నామని బొత్స అన్నారు.


 



మరింత సమాచారం తెలుసుకోండి: