కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ బండి సంజయ్ తో మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావటంతో సీఎస్ జోషీని కలిసి ఆడియో టేపుల గురించి వివరణ ఇచ్చుకున్నారు. కలెక్టర్ సర్పరాజ్, ఎంపీ బండి సంజయ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల వలన రగడ మొదలైంది. గంగుల కమలాకర్ ఎన్నికల అఫిడవిట్ అంశంకు సంబంధించిన సంభాషణల గురించి కలెక్టర్ వివరణ ఇచ్చుకున్నారు. 
 
ఈరోజు సాయంత్రం కలెక్టర్ చీఫ్ సెక్రటరీ జోషీని కలిసి పూర్తి స్థాయి వివరణ ఇచ్చుకున్నారు. వాస్తవానికి 8 నిమిషాల నిడివి ఉన్న ఆడియో సంభాషణ బయటకు రావటంతో వివాదం మొదలైంది. కేవలం 90 సెకన్లు మాత్రమే మొదట బయటకు రిలీజ్ చేశారని కలెక్టర్ జోషీకి వివరించారని సమాచారం. ఈ వివాదం ఇప్పుడు మొదలైన వివాదం కాదని సమాచారం. 
 
ఆడియో టేపులు రిలీజ్ చేయడం ద్వారా మంత్రికి మరియు ఎంపీకి గ్యాప్ పెంచాలని ఈ ఆడియో టేపులను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఆడియో టేపుల వ్యవహారంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కలెక్టర్ సర్పరాజ్ బండి సంజయ్ తో తాను మాట్లాడింది నిజమేనని కూడా ఇప్పటికే ఒప్పుకున్నారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం నన్ను ఓడించటానికి కుట్ర జరిగిందని చెప్పటానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుందని ప్రశ్నించారు. 
 
లీకైన ఆడియోలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నుండి పోటీ చేసిన బండి సంజయ్ తెరాస అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోవటంతో బండి సంజయ్ పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చుచేశారని కోర్టుకెళ్లారు. ఫోన్ కాల్ లో అభ్యర్థుల ఖర్చు గురించి సంజయ్ కలెక్టర్ తో చర్చించారు. నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలట్ కౌంట్ జరిగిందని కలెక్టర్ సంజయ్ తో చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: