సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలకు వెళితే..పాత గోడలపై ఆవు పిడకలు కనిపిస్తుంటాయి.  ఇకప్పుడు ఆవు పిడకలు ఎన్నో వాడకాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది..ఆవు పిడకలకు బాగా డిమాండ్ పెరిగింది. కాకపోతే అది ఇక్కడ కాదు. గతంలో ఆన్‌లైన్‌లో ఆవు పిడకల అమ్మకం గురించి మనం చూశాం.  అప్పట్లో ఆ వ్యవహారం చాలా వైరల్‌గా మారిన విషయం కూడా తెలిసిందే.  ఇప్పుడు మరోసారి ఆవు పిడకల అమ్మకం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి. తాజాగా విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికాలో వీటికి డిమాండ్ పెరుగుతోంది. 

న్యూజెర్సీలో ని ఓ షాప్ లో ఆవు పేడతో రూపొందించిన పిడకలు ప్యాకెట్లలో అమ్మకానికి పెట్టారు. ఆంగ్లంలో వీటికి 'కౌ-డంగ్ కేక్స్' అని పేరు పెట్టారు.  ఇది ఓ భారతీయ ఉత్పత్తి, ఇది తినే పదార్థం కాదు. మతపరమైన విషయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి’ అని ప్యాకెట్ మీద ముద్రించి ఉండటం విశేషం.  అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ షాపులో ఆవు పిడకలు దర్శనమిచ్చాయి.

పది పిడకలు ఉన్న ప్యాకెట్ ధర ఏకంగా రూ.214 గా ఉండటంతో ఆ ప్యాకెట్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ప్యాకెట్‌పై అది తినే పదార్ధం కాదని.భారత్‌కు చెందిన ఉత్పత్తిగా పేర్కొన్నారు.స్థానికంగా నివసించే ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దీన్ని ఫోటో తీసి తన బంధువుకు పంపించాడు. అనంతరం ఇది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అవడంతో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: