రోజు  రోజుకు  మనుషుల్లో  ఆత్మస్దైర్యం తగ్గుతుంది.  ఎదురయ్యే  సమస్యల్ని  అధిగ మించలేక,  మానసికంగా  కుంగిపోతున్నారు.  విషయం  చిన్నదైన పెద్దదైనా నానా  హైరాన పడిపోతూ ఏమవుతుందోననే భయంతో జీవితాన్నే చాలించాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.


బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం నల్లిని నలిపేసినట్లుగా మారింది ఈ కాలంలో. ప్రేమ విఫలమైతే చావు, చదువులో ఫేయిలైనా, తల్లిదండ్రులు మందలించినా, ఇలా చిన్న చిన్న విషయాలనే అవమానంగా భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. అన్ని సంవత్సరాలు పిల్లలను కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులను మరచి అంతటి సాహసానికి ఎలా తెగబడుతున్నారో అర్ధం కావడం లేదు.


ఇకపోతే ఒక మనిషి బ్రతకాలంటే ఎదురమ్మే సమస్యల్ని అధిగమించాలి. కాని సమస్యను బూతద్దంలో పెట్టి చూస్తూ దాన్ని పెద్దదిగా భావించి ఇలాంటి పనికి మాలిన పనులు చేయకూడదు. లోకంలో బలవంతంగా చావాలంటే ఎంతగానో ధైర్యం కావాలి,


ఆ ధైర్యాన్నే, ఆతెగువనే బ్రతకడానికి చూపిస్తే బ్రహ్మండంగా బ్రతకవచ్చూ ఈ చిన్న లాజిక్‌ను మిస్సవుతున్న యువత ఉన్నత చదువులు చదివి ఏం లాభం. ఇకపోతే చిన్న విషయానికే కృష్ణాజిల్లా గన్నవరంలో డిగ్రీ చదువుతున్న యువకుడు ఒకరు సుసైడ్ చేసుకుని మరణించారు.


అతని పేరు మురళీగా తెలిపారు. పోలీసుల వేధింపుల వల్లే అతను మరణించారని బంధువులు తెలుపుతున్నారు. ఇకపోతే  ఏస్సై భర్త వాహనాన్ని యూవకుడు ఢీకొట్టడం వల్ల నిత్యం పోలీసులు వేధించారంటూ మరో వైపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక నిజానిజాలు బయటకు తీసే పనిలో పోలీసులు పడ్డారు.


వారి వేధింపుల వల్లే అతను చెరువులోకి దూకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆందోళనకు దిగారూ. ఇకపోతే చెరువులోని మురళి మృతదేహాన్ని బయటకు తీసి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ ప్రారంభించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: