ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కృష్ణా జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ నేతలు వరుసగా చంద్రబాబుకు షాకులు ఇస్తూ వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. అయితే కృష్ణా జిల్లాలో టీడీపీని వీడే నేతల్లో ఎక్కువ శాతం మాజీ మంత్రి దేవినేని ఉమా వల్ల అసంతృప్తికి లోనైవారే ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు కొడాలి నాని నుంచి నేడు వల్లభనేని వంశీ వరకు టీడీపీని వీడిన వారు ఉమాని బండ బూతులు తిట్టే వెళుతున్నారు. ఎన్నికల ముందు వసంత కృష్ణప్రసాద్ కూడా అదే పని చేసి వెళ్లారు.


అయితే ఇంతలా దేవినేని మీద అసంతృప్తి పెరగడానికి కారణం ఆయన డామినేషన్. జిల్లాపై పెత్తనం చేస్తూ ఉమా సొంత నేతలనే ఇబ్బందులు పెడుతున్నారు. అందుకే ఆయన అంటే చాలామంది అసంతృప్తిగానే ఉంటున్నారు. పైగా ఆయన చెప్పేదే చంద్రబాబు కూడా వింటారు. అధికారంలో ఉన్నప్పుడు వంశీని ...ఉమా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. 


గన్నవరం నియోజకవర్గంలో ఓ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడానికి కారణం కూడా ఉమానే. అలాగే పోలవరం కాల్వ ద్వారా నియోజకవర్గంలోని రైతులు మోటార్లతో నీరు పెట్టుకున్న ఉమా వెళ్ళి బాబు వద్ద ఫిర్యాదులు చేసి ఆపించేవారు. దీంతో దేవినేని మీద ఉన్న అసంతృప్తి, టీడీపీకి భవిష్యత్తు శూన్యం అని భావించడంతో వంశీ వైసీపీ వైపు వెళ్లారు. అయితే ఇంకా టీడీపీలో ఉమా మీద అసంతృప్తితో ఉన్న నేతలు చాలానే ఉన్నారు. ఆయన పెత్తనం సహించలేని వారిలో గద్దె రామ్మోహన్, కేశినేని నానిలు ముందున్నారు.


అలాగే బుద్దా వెంకన్న, బొండా ఉమాలకు కూడా దేవినేని అంటే పడదు. ఇక  గత టీడీపీ ప్రభుత్వంలో కాగిత వెంకట్రావు లాంటి సీనియర్ నేతలకు మంత్రి పదవి రాకపోవడంలో కీలక పాత్ర ఉమాదే అని టాక్ కూడా ఉంది. అవ్వడానికి జిల్లా అధ్యక్షుడైనా పెత్తనం మాత్రం ఉమా చేతుల్లో ఉండటంతో బచ్చుల అర్జునుడు కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జిల్లాలో ఉమా యాంటీ వర్గం చాలానే ఉంది. మరి ఉమా పెత్తనం వల్ల జిల్లాలో టీడీపీ ఇంకా ఎంతవరకు దెబ్బ తింటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: