ఎప్పుడైనా మన బంధువు చనిపోయారంటేనే శ్మశానం వైపు వెళ్లాడనికి ఆలోచిస్తాం. ఒకానొకసాయంలో ఆమ్మో శ్మశానం అని భయపడుతాం. అలాంటిది ఓ వ్యక్తి తల్లిదండ్రుల సమాధి తవ్వి.. అందులో ఉన్న ఎముకలను ఎత్తుకొని పోయాడు. ఈ ఘటన తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనను చుసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 


ఇంకా వివరాల్లోకి వెళ్తే .. నాంపులాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల శ్మశానంలోకి వెళ్లి తన తల్లిదండ్రులు, తన పిన తండ్రి సమాధులను తవ్వాడు. అనంతరం ఆ సమాధిలలో ఉన్న వారి ఎముకలను తీసి మూట కట్టుకుని అమ్మడానికి బయల్దేరాడు. అయితే అదే సమయంలో పోలీసులు అక్కడికి రాగా అనుమానస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తినుకున్నారు. 


అనంతరం అతని ముఠాలో ఏముంది అని వెతకగా అతడు ఎవరినో హత్య చేసి ఉంటాడని భావించారు. అయితే అతన్ని పోలీసు స్టయిల్లో విచారించగా నిజం బయట పడింది. ఓ వ్యాపారి ఎముకలను తీసుకొస్తే అతనికి కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పాడని, అందుకే తన తల్లిదండ్రుల సమాధి నుంచి ఆ ఎముకలు తీసుకొచ్చానని అతను పేర్కొన్నాడు. 


అయితే ఎముకలు తీసుకొని అక్కడికి వెళ్లగా ఆ వ్యాపారి కనిపించలేదని.. ఒకవేళ కనిపించింతే ఆ ఎముకలు అమ్మి ఆ డబ్బుతో తాను బైకు కొనుగోలు చెయ్యాలని అనికున్నట్టు ఆ వ్యాపారి తెలిపాడు. ఈ విషయంపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసులో గతంలో కూడా చాల నమోదయ్యాయని, ఔషదాల తయారీలో ఎముకలను ఉపయోగిస్తామని, అందుకు భారీ మొత్తం చెల్లిస్తామని అమాయకులకు ఆశ చూపుతూ కొందరు ఎముకలు స్మగ్లింగ్ చేస్తున్నారని అయన తెలిపారు. అయితే అందులో కొన్ని ఎముకలు చేతుబడులు చేసే వారికీ సరఫరా చేసినట్టు అయన తెలిపారు. 


అయితే గతంలో ఇలా ఎముకలతో దొరికినవారు ముఠాతో దొరికారు అని కానీ ఇతను ఒక్కడే ఆ సమాధిని ఎలా తొవ్వగలిగాడు అని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. సమాధులను సాధారణంగా తవ్వే వారే ఆ వాసనకు ఎంతో ఇబ్బంది పడుతారని అలాంటిది ఇతగాడు తల్లిదండ్రుల సమాధిని ఎలా తవ్వాడు అని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: