5 నెలల తరువాత, 50మంది నిర్మాణరంగకార్మికులు చనిపోయాక, వందలకుటుం బాలు రోడ్డునపడ్డాక, నిర్మాణరంగం కుదేలయ్యాక,  సిమెంట్‌ ఐరన్‌ ధరలుపడిపోయాక, ఇసుకసమస్యపై కళ్లుతెరిచినట్లుగా రాష్ట్రప్రభుత్వం నటిస్తోందని, తెలుగుదేశంపార్టీ రాష్ట్రఅధ్యక్షులు, మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు ఎద్దేవాచేశారు. అధికారంలోకి వచ్చాక ఇసుకకృత్రిమకొరత సృష్టించిన రాష్ట్రప్రభుత్వం, 5నెలల తరువాత వైఎస్సార్‌ ఇసుకమాఫియా పేరుతో నియోజక వర్గాలవారీగా ఇసుకదోపిడీ పెంచేలా కొత్తవిధానాన్ని తీసుకొచ్చిందని, ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలే అందుకు నిదర్శనమని కళా స్పష్టంచేశారు.


శ్రీకాకుళంలోని రాజాం నియోజకవర్గంలోని తునివాడ ఇసుకరీచ్‌లో టన్ను ఇసుకధరను రూ.556గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నాలుగుటన్నుల ఇసుకధర కొనుగోలు రూ.556వంతున రూ.2224వరకు అవుతుందని, కొనుగోలు పాయింట్‌నుంచి గ్రామాల కు తరలించడానికి లేబర్‌ మరియు రవాణాఛార్జీలు కలిపి అదనంగా రూ.1500లవరకు అవుతుందని, మొత్తంగా ట్రాక్టర్‌ ఇసుక రూ.3,724లకు కొనాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వహయాంలో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 4టన్నులుండే ఇసుక ట్రాక్టర్‌ధర రూ.1400 ఉంటే, ఇప్పుడు అదే ట్రాక్టర్‌ఇసుక రూ.3,700లకు అమ్మడంద్వారా ప్రభుత్వం ఎవరిజేబులు నింపుతుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. అలానే శ్రీశైలం నియోజకవర్గంలో టన్ను ఇసుకధరను రూ.1865గా నిర్ణయించారని, 4టన్నులకు కలిపి, లేబర్‌, రవాణాఛార్జీలతో ట్రాక్టర్‌  ఇసుకధర రూ.9000లు అవుతుందని, కృష్ణానది పక్కనేఉన్నాకూడా ఆ నియోజక వర్గప్రజ లు ట్రాక్టర్‌ఇసుకను రూ.9వేలకు కొనేదుస్థితిని ప్రభుత్వమే కల్పించిందన్నారు. 


ప్రతిపక్షాల పోరాటంతో, కార్మికుల చావులతో ఇసుకసమస్యపై కళ్లుతెరిచినట్లుగా నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలవారీగా తయారుచేసిన ఇసుకమాఫియాకు  ప్రకటనల పేరుతో దోపిడీకి అధికారిక లైసెన్సులు మంజూరుచేసిందని కళా ధ్వజమెత్తారు. ఉచిత ఇసుకవి ధానం ఉన్నప్పుడు, వైసీపీప్రభుత్వంలో ఇసుకలభ్యత, ధరల్లోనివ్యత్యాసం తెలుసుకోవాలంటే ప్రభుత్వమే ఇంటిలిజెన్స్‌తో సర్వే చేయించుకోవచ్చని ఆయన సూచించారు. నియోజక వర్గనేతలే దగ్గరుండి ఇసుకమాఫియాను పెంచిపోషించేలా  ప్రభుత్వమే రీచ్‌లవారీగా ప్రకటనలిచ్చిందని, 5ట్రాక్టర్లు రీచ్‌లో లోడ్‌అయితే, 3ట్రాక్టర్లు బ్లాక్‌లో అమ్మేలా, ఇసుకమాఫియా రెచ్చిపోయేలా అధికారికంగానే మార్గం సుగమం చేసిందన్నారు. 


నీరు, గాలి మాదిరిగానే ఇసుకకూడా ప్రజలు వినియోగించుకునేలా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కళా ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుకవిధానాన్ని పరిశీలించినా, ఇప్పుడు ఇసుకలభ్యతపేరుతో ఇచ్చిన ప్రకటనలుచూసినా  ప్రభుత్వ పర్యవేక్షణలోనే వైసీపీనేతలు ఇసుకదోపిడీ చేసేలా తలుపులు తెరిచారనేది స్పష్టమవు తోందన్నారు. ఇసుకపై ప్రభుత్వం నిర్ణయించిన ధర సామాన్యులకు, బిల్డర్లకు అందుబాటు లో లేదని, గతప్రభుత్వం కన్నా మూడురెట్లు అధికంగా పెంచారని వెంకట్రావు చెప్పారు.  ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం, భవననిర్మాణకార్మికుల చావులను నివారించే సంజీవని  ఉచిత ఇసుకవిధానమేనని, ప్రభుత్వం దాన్నే అమలుచేయాలని ఆయన డిమాండ్‌చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: