వొడాఫోన్ ఐడియా ఎంతోమంది వినియోగదారులను కలిగి ఉన్న టెలికం  సంస్థ. కానీ ప్రస్తుతం ఈ సంస్థ నష్టాల బాటలో నడుస్తుంది. తాజాగా కంపెనీ యొక్క కష్టాలను 50, 921 కోట్ల మేర నష్టాల ను ప్రకటించింది. అయితే వొడాఫోన్ ఐడియా టెలికం సంస్థ ప్రస్తుతం వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది  . డిసెంబరు 1 నుంచి టారిఫ్  ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది వోడాఫోన్ వీడియో సంస్థ . తమ కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యమైన సేవలు అందించేందుకు వొడాఫోన్ ఐడియా టెలికం సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. 

 

 

 

 అంతే కాకుండా ప్రపంచ దేశాల కంటే ఇండియాలో మొబైల్ డేటా ప్రపంచంలోనే చాలా తక్కువగా చౌకగా  ఉందని తెలిపిన వోడాఫోన్ ఐడియా టెలికం సంస్థ... దీని వల్ల నష్టాలు ఎక్కువవుతున్నాయంటూ తెలిపింది . అయితే ఈ నూతన టారిఫ్ ధరలను e ఎంతమేరకు పెంచేది ప్రకటనలో పేర్కొనలేదు  వోడాఫోన్ ఐడియా సంస్థ . దీంతో వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ టారిఫ్  ధరలను పెంచుతుందని ప్రకటన చేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వేరే నెట్వర్కు పోర్ట్ అయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 

 

 

 

 ఇదిలా ఉంటే తాజాగా ఈ సంస్థ 50, 921 కోట్ల మేర నష్టాల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కూడా మరోవైపు వార్తలు వస్తున్నాయి . కాగా  ఇంత పెద్ద ఎత్తున టెలికామ్ కంపెనీ నష్టాలను వెల్లడించడం టెలికం రంగ చరిత్రలో ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వొడాఫోన్ ఐడియా టెలికం సంస్థ కు వచ్చిన నష్టాలను భర్తీ భర్తీ చేసేందుకు టారిఫ్  ధరలను పెంచుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. అయితే డిసెంబరు 1 నుంచి టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా టెలికం సంస్థ ప్రకటించడంతో... ఎంత మేరకు టారిఫ్  ధరలు పెంచుతున్నదో అని  వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: