ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా బురదచల్లుతున్న కథనాలు, వార్తలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపైనే ప్రయోగించబోతున్నారా ? అవుననే అర్ధమైపోతోంది విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలు విన్న తర్వాత.  ప్రభుత్వం స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తిలిసిందే.

 

సరే ఎవరి వ్యతిరేకత ఎలాగున్నా ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రిక ’కొత్తపలుకు’లో రాధాకృష్ణ తన పైత్యాన్నంతా కుమ్మరిస్తుంటారు జగన్ కు వ్యతిరేకంగ. మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న దగ్గర నుండి జగన్ కు వ్యతిరేకంగా రాధాకృష్ణ పైత్యం బాగా ఎక్కువైపోయింది. ఇందులో భాగంగానే మొన్నటి ఆదివారంలో ఇంగ్లీషు మీడియం చదువులపై  చెత్తంతా పోగేశారు.

 

రాధాకృష్ణ పైత్యం ప్రకారం క్రిస్తియన్ మతంలోకి మార్చేందుకే జగన్ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నారట. బిసిలను క్రిస్తియన్ మతంలోకి మార్చేయటం చాలా సులభమట. క్రిస్తియన్ ఓట్లును పెంచుకోవటం కోసమే జగన్ ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడుతున్నారనే అర్ధమొచ్చే విధంగా మొత్తం చెత్తంతా రాసేశారు.

 

ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదివినంత మాత్రాన క్రిస్తియన్ మతంలోకి మారిపోతారా ? అన్న కనీస ఇంగితం కూడా రాధాకృష్ణకు లేకపోయింది. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబునాయుడు, రాధాకృష్ణ వారసులతో పాటు ఎన్ని లక్షలమంది క్రిస్తియన్ మతంలోకి మారిపోయారో ? రాధాకృష్ణ చెప్పగలరా ?

 

వ్యక్తిమీద ధ్వేషం పెంచుకుని మొత్తం సమాజాన్నే రాధాకృష్ణ కంపు చేసేస్తున్నారనటంలో సందేహమే లేదు. జగన్ సిఎం అయిన తర్వాత హిందు-క్రిస్తియన్ తేడాలు వచ్చేస్తున్నాయన్నట్లుగా రాయటంలో కూడా అర్ధమేలేదు. రాధాకృష్ణ లెక్కప్రకారం చంద్రబాబే బతికినంత కాలం సిఎంగా ఉండాలి.

 

కానీ రాధాకృష్ణ ఆలోచనతో పనిలేకుండా జనాలు మాత్రం టిడిపికి గూబగుయ్యిమనిపించారు. దాంతో చంద్రబాబుతో పాటు ఈయన కూడా జనాలపై విషం చిమ్మటం మొదలుపెట్టారు. ఈ విషయాన్నే ఆదిమూలపు ప్రస్తావిస్తు రాధాకృష్ణపై లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: