అనుభవం లేకపోయిన తొలిసారి అధికారంలోకి వచ్చి ప్రజలు మెచ్చే పాలన అందిస్తున్న సీఎం జగన్ కు ప్రతిపక్షాలు ఒక సంవత్సరం కూడా సమయం ఇవ్వకుండా ఒక నెల నుంచే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ జగన్ పాలన మొదలుపెట్టి ఆరు నెలలు కావొస్తోంది. ఈ ఆరు నెలల కాలం నుంచి ప్రతిపక్ష టీడీపీ ఏ స్థాయిలో రాద్ధాంతం చేస్తోందో చూశారు. ఇక టీడీపీని అనుసరించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజకీయ విమర్శలు దాడి మొదలుపెట్టారు.


ఇక వీరే ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఏం తక్కువ తినకుండా జగన్ ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శిస్తుంది. అందులో ముఖ్యంగా ఒకప్పుడు వైఎస్ ఫ్యామిలీ కు వీరవిధేయుడుగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఓ రేంజ్ లో వైసీపీపై ఫైర్ అవుతున్నారు. మిగతా నాయకులు ఒక రోజు కాకపోతే మరొకరోజు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా...కన్నా మాత్రం ప్రతి రోజూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.


జగన్ పాలన మొదలైన సమయంలో అక్రమ కట్టడం ప్రజా వేదిక కూల్చివేత దగ్గర నుంచి... నేడు పేద పిల్లలకు ఉపయోగపడేలా తీసుకొచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టె నిర్ణయం వరకు కన్నా...జగన్ ని గ్యాప్ లేకుండా విమర్శిస్తున్నారు. ఇక తాజాగా అయితే మత రాజకీయం కూడా తెరపైకి తెచ్చారు. అయితే ఇలా ప్రతి విషయంలో కన్నా, జగన్ ని విమర్శించడానికి కారణం లేకపోలేదు. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి అందులో ఎవరైనా అధ్యక్షులు అయ్యే అవకాశముంది. 


దీంతో తన అధ్యక్ష పదవి ఎక్కడ ఊడి వేరే వాళ్ళకు వెళ్లిపోతుందేమో అని భయంతో తన ఉనికిని చాటుకునేందుకు కన్నా జగన్ ప్రభుత్వంపై ఇంత దూకుడుగా ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన వారు కొందరు అధ్యక్ష పదవి కోసం కాచుకుని కూర్చున్నారు. దీంతో కన్నా ఎక్కడ తగ్గకుండా జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి కన్నా తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ ని టార్గెట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: