ఆర్టీసీ కార్మికులకు తొందరలోనే షాక్ తప్పేట్లు లేదు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం విషయంలో ఎప్పుడైతే హై కోర్టు కూడా చేతులెత్తేసిందో సమ్మె విషయం లేబర్ కోర్టులోకి వచ్చింది. అదే సమయంలో రెండు వారాల్లో సమ్మె పరిష్కారమయ్యేలా చూడాలంటూ లేబర్ కమీషనర్ ను కూడా కోర్టు ఆదేశించింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆల్రెడీ లేబర్ కమీషనర్ ఆర్టీసీ సమ్మె విషయంలో ఓ నిర్ణయం తీసేసుకున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చట్ట విరుద్ధమంటూ కమీషనర్ ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేశారు. అదే విషయాన్ని కేసియార్ ప్రస్తావించారు కూడా. ఇపుడు సమ్మె పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు లేబర్ కమీషనర్ ను ఆదేశించటంలో అర్ధంలేదు.

 

కోర్టు ఆదేశించిన నేపధ్యంలో కమీషనర్ మరో రిపోర్టు ఇస్తే ఇవ్వచ్చు. అది కూడా కేసీయార్ ఆలోచనలకు తగ్గట్టే ఉంటాయనంటో ఎవరికీ సందేహం లేదు. కాబట్టి తొందరలోనే ఆర్టీసీలోని 48 వేలమంది సిబ్బందిని ఉద్యోగాల్లో నుండి తొలగించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే రెండుసార్లు సిబ్బందిని ఉద్యోగాల్లో నుండి డిస్మిస్ చేసినట్లు కేసియార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

సరే సిబ్బందిని డిస్మిస్ చేశామని కేసియార్ చెప్పినంత మాత్రానా డిస్మిస్ అయిపోతారా ? అంటే కాలమే సమాధానం చెప్పాలి.  మొత్తానికి ఆర్టీసీ 45 రోజుల నిరవధిక సమ్మె సంస్ధ చరిత్రలోనే సుదీర్ఘకాలం జరిగిన సమ్మెగానే చెప్పుకోవాలి. కాకపోతే ఇన్ని రోజులు సమ్మె జరిగినా సుమారు 23 మంది మరణించినా ఫలితమైతే దక్కలేదు.

 

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే డిమాండ్ ను పక్కనపెట్టేసినా కూడా యూనియన్ నేతలతో చర్చలు జరపటానికి కేసియార్ ఇష్టపడకపోవటం మాత్రం క్షమించరానిదే అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మొత్తానికి ఆర్టీసి సమ్మె విషయంలో  కేసియార్ కు తాత్కాలికంగా విజయం లభించి ఉండచ్చు. కానీ దీర్ఘకాలంలో కానీ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పరిస్ధితేంటో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: