ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య ఆసక్తికరం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడుస్తున్నాయి. ముఖ్యంగా 2014లో కలిసి పోటీ చేసిన టీడీపీ,బీజేపీ, జనసేనలు..ఇప్పుడు ప్రతిపక్షంలో పొత్తు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ మూడు పార్టీలు రాజకీయం ఏ అంశం దొరికితే ఆ అంశాన్ని వాడేసుకుంటున్నాయి. అయితే ఇందులో టీడీపీ మాత్రం బీజేపీ,జనసేనలో ఏ లైన్ లో అయితే పోరాడుతున్నాయో, వాటిని కాపీ కొట్టేసి అదే విధానంలో జగన్ పై విమర్శలు చేస్తోంది.


అలా చాలానే విధానాల్లో టీడీపీ ఆ రెండు పార్టీలని ఫాలో అవుతుంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎప్పుడు చేయని రాజకీయం ఒకటి చేస్తోంది. అది కూడా బీజేపీ ఎక్కువగా రాజకీయం చేసే అంశంలోనే. సాధారణంగా బీజేపీ ఎక్కడ ఉన్న మత రాజకీయాలు చేయడంలో ముందుంటుంది. అదే ఫార్ములాని ఏపీలో కూడా వాడుతుంది. జగన్ ప్రభుత్వంలో మత ప్రచారాలు పెరిగిపోయాయని, హిందూ దేవాలయాలని కూలగొడుతున్నారని మండిపడుతుంది.


ఇక ఇదే కాన్సెప్ట్ ని టీడీపీ కూడా వాడుకుంటుంది. జగన్ కు మత రాజకీయాలని ఆపాదించాలని చూస్తోంది. గుంటూరులో ఓ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న కనకదుర్గమ్మ దేవాలయాన్ని అధికారులు కూలగొట్టారు. ఇక దీనిపై బీజేపీ ఎలాగో రచ్చ చేస్తోంది. ఇదే అంశంలో టీడీపీ కూడా రాజకీయం చేస్తోంది. అయితే టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా రోడ్లు విస్తరణలో భాగంగా కొన్ని దేవాలయాలని కూల్చివేశారు. మరి ఆ విషయం టీడీపీ వాళ్ళకు గుర్తు రాలేదేమో. అలాగే జగన్ క్రిస్టియన్ అని తిరుపతి వెళ్ళేప్పుడు డిక్లేరేషన్ ఇవ్వకుండా ఎలా ఆలయం లోపలకు వెళ్లతాడని స్వయంగా చంద్రబాబే ప్రశ్నించారు.


అయితే జగన్ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అయినా.. గతంలో తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని ఎప్పుడు ఆలయానికి వెళ్లినా అది వర్తిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. పదేపదే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, గతంలో ఇచ్చిన డిక్లరేషన్ సరిపోతుందని పేర్కొంటున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇందుకు అంగీకరించడంలేదు. ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికైతే టీడీపీ మాత్రం ఏది గతి లేక మతాలని కూడా అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడిపేయడానికి చూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: