
ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. మొదటి మూడు నాలుగు నెలలు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే అంశపైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. హామీలు అమలు జరిగిన తరువాత మిగతా విషయాలపై దృష్టి పెట్టాలని అన్నది జగన్ అభిమతం. అందుకే జగన్ మొదట ఈ విషయంపైనే దృష్టిపెట్టారు.
రోజుకో పధకాన్ని మంత్రుల ముందుకు, అధికారుల ముందుకు తీసుకొస్తూ.. దానిని అమలు చేస్తూ జగన్ మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా రైతుల కోసం అమలు చేసిన రైతు భరోసా పధకం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. రైతు భరోసా కింద ప్రతి రైతులు పంట వేసుకోవడానికి, విత్తనాల కోసం ఇతరత్రా ఖర్చుల కోసం 15 వేలరూపాయలను ప్రభుత్వం రైతుల అకౌంట్స్ లో వేస్తున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 45,20,616 కుటుంబాలకు చెందిన రైతులకు రైతు భరోసా పధకం ద్వారా ఉపాధి లభించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. సుమారుగా 5,185 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంపైనే సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అగ్రికల్చర్ మిషన్ వెబ్ సైట్ ను ప్రారంభించారు.
ఈ వెబ్ సైట్ ప్రారంభించిన తరువాత వివిధ అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులను కూడా రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఇక జనవరి 1 వ తేదీ నుంచి గ్రామ సచివాలయ పరిధిలో వర్క్ షాప్, ప్రజలకు, రేషన్ ద్వారా ప్రజలకు అందించే వస్తువులకు సంబంధించిన దుకాణాలను ప్రారంభిస్తామని జగన్ పేర్కొన్నారు.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్