సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చెందటంతో ఇప్పుడు ఆ పార్టీని నడిపించే నాయకుడు ఎవరని పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు వయసు 70 ఏళ్ళు పైబడి ఉంది. ఇక లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ సైతం లోకేష్ లాంటి అసమర్థుడిని కాపాడడానికి జూ. ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టాడని ఘాటు విమర్శలు చేశారు. ఇక కొడాలి నాని సైతం లోకేష్ కోసం ఎన్టీఆర్ ను బలిచేశారని.. లోకేష్ కంటే 100 రెట్లు ఎన్టీఆర్ బెటర్ అంటూ ఆడిపోసుకున్నారు. లోకేష్ నాయకత్వం టీడీపీని పాతిపెడుతుందని ధ్వజమెత్తారు.ఇలా ఇంటా బయటా లోకేష్ బాబు టీడీపీ భావి వారసుడు కాదని.. జూ. ఎన్టీఆరే రావాలన్న వాదనలు వినిపిస్తున్న వేళ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దీనిపై హాట్ కామెంట్ చేశారు.


ఎన్టీఆర్ ను సైడ్ చేసేందుకు ఈ పూజారి చాలా ప్రయత్నం చేశారు. ఓ రకంగా టీడీపీ వాదనను వినిపించారు. వర్ల రామయ్య మాట్లాడుతూ.. 'చంద్రబాబు ఇప్పటికీ బలమైన నేతగా ఉన్నారు. నాయకత్వం వహించే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. చంద్రబాబే టీడీపీకి బలం బలగం.. కాబట్టి ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం లేదు' అని క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో వర్ల తెలివిగా లోకేష్ ను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చకుండా చంద్రబాబును ముందుపెట్టి జూనియర్ ను ప్రస్తుతానికైతే పక్కకు తప్పించారు.


అయితే బాబు తరువాత లోకేషే లీడర్ అని మాత్రం చెప్పలేపోయారు. చంద్రబాబు తరువాత ఏంటన్న ప్రశ్నకు మాత్రం వర్ల సమాధానం ఇవ్వకపోవడం చూస్తే ఆయనకు లోకేష్ పై నమ్మకం లేదా అని టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ ను పోటీకి దింపకుండా చంద్రబాబే నాయకుడు అనడం చూస్తుంటే టీడీపీ లో కూడా లోకేష్ బాబు నాయకత్వంపై నమ్మకం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.అయినా టీడీపీ నేతలు కోరినా.. చంద్రబాబు లోకేష్ లు తప్పుకున్నా ఇప్పుడైతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి లేరు. సినిమా కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఎన్టీఆర్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: