ఆర్టీసీ కార్మికులకు 45 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  నిన్నటితో అయిన ఆర్టీసీ సమ్మె సమస్య ఓ కొలిక్కి వస్తుంది అనుకుంటే ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు.  అటు హైకోర్టు కూడా ఈ విషయంలో ఏమి తేల్చలేకపోయింది.  దీంతో కార్మికులకు యేమి చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  45 రోజుల సమ్మె బూడిదలో పోసిన పన్నీరు అయ్యేలా కనిపిస్తోంది.  సమ్మె విరమణ చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం.  
కార్మికులు సమ్మెను విరమించినా.. ప్రభుత్వం చర్చలు జరుపుతుండగా అన్నది చూడాలి.  కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధం అని చెప్పలేమని హైకోర్టు చెప్తోంది.  అంతేకాదు, కార్మికులకు సంబంధించిన కేసు లేబర్ కోర్టులో ఉన్నది కాబట్టి రెండు వారాల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది.  దీంతో ఆర్టీసీ కార్మికుల సమస్య మరింత జఠిలంగా మారే విధంగా కనిపిస్తోంది.  
5100 రూట్లలో ప్రైవేట్ బస్సులకు అనుమతించే విషయంలో కెసిఆర్ సర్కార్ వెనకడుగు వేయడం లేదు.  కార్మికులు సమ్మెకు దిగడం వలన ఆర్టీసీకి భారీ నష్టం వచ్చింది.  ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఇప్పుడు నడపడం చాల కష్టం అని, అందుకోసమే కొన్ని రూట్లలో ప్రైవేట్ బస్సులను తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  
దీని వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పక్కర్లేదు.  ప్రైవేట్ బస్సులను అనుమతి ఇస్తే.. ప్రైవేట్ వ్యక్తులు నడిపే బస్సులు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి బాధ్యులు ఎవరు.. నగరంలో సెట్విన్ బస్సులు తిరుగుతున్నాయి.   వాటి కండిషన్ ఎలా ఉన్నదో తెలిసిందే.  బస్సులు ఫుల్ అయ్యే వరకు కదలవు.  సెట్విన్ బస్సు ఎక్కిన వ్యక్తులు సమయానికి గమ్యస్థానానికి చేరుకుంటారు అనే గ్యారెంటీ లేదు. మరి ఇలాంటి సమయంలో ప్రైవేట్ బస్సులకు రాష్ట్రంలో అనుమతి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఒకసారి ఆలోచిస్తే మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: