ఎవరైన ఒక మంచిపని చేస్తుంటే కొందరు మెచ్చుకునే వారుంటారు. మరికొందరు కించపరిచే వారుంటారు. కాని ఎవరేమన్నా చేసేపనిలో నిజాయితి ఉంటే ఎవరేమనుకున్న ముందుకెళ్లవచ్చూ. ఐతే ఒక మంచి పని చేయడానికి కొన్ని హద్దులుంటాయి చెడు పనికి ఏ హద్దు ఉండదు. నువ్వు చేసేపని నలుగురికి నచ్చేలా ఉండకున్నా ఫర్వాలేదు కాని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకునేలా ఉండాలి తప్పా నిన్ను ప్రశ్నించేలా ఉండకూడదు.

 

ఇక ఈ మధ్యకాలంలో కొందరు ఓ మోస్తారు పేరుగాంచిన స్టార్స్ మాటి మాటికి ఒంటి మీది గుడ్డలు ఊడదీసుకొని తమ నిరసనలు తెలియచేస్తున్నారు. ఈ చర్య వారికి సిగ్గు అనిపించడం లేదు. పైగా చూసేవారికి పైసా ఖర్చూ లేకుండా ఓ ఆడది ఒళ్లు చూపిస్తుందనే భావనతో ఉంటారే తప్పా తను ఎందుకోసం ఇలా చేస్తుందని ఆలోచించే వారే లోకంలో లేరు.ఇలాంటి వార్తలు గాని వీడియోలు గాని మీడియాలో చాలా పాపులర్ అవుతాయి.

 

అసలు సమాజంలో నీతివంతులుంటే ఇలా గుడ్డలూడదీసుకుని తిరిగే ఖర్మ పట్టదు. మరి ఇది గ్రహించకుండా అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు కొందరు మహిళలు. ఇంతకు ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే. చిలీకి చెందిన ప్రముఖ గాయని మోన్ లాఫర్తే ఏ ఆడపిల్ల చేయకూడని ఓ పని చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. అదేమంటే తన దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలని తనదైన శైలిలో నిరసన చేసింది. వాస్తవంగా ఈమె చేసిన పనివల్ల ఎంతగా మేలు కలుగుతుందో చేప్పలేము గాని ఓ స్త్రీ గా జన్మించి ఇలా చేయడం మాత్రం సరైన పద్దతి కాదంటున్నారు సంస్కారవంతులు కొందరు.

 

ఇంతకు ఏం చేసిందంటే ఆమెను ఓ అవార్డ్ వేడుకకు పిలిచి అవార్డుతో సత్కరించారు.  అయితే వేడుకకు ఒంటినిండా దుస్తులు వేసుకుని ఎక్కడా ఇసుమంతైనా ఎక్స్‌పోజింగ్ లేకుండా లఫర్తే రావడం చూసి చాలా మంది ఆశ్యర్చపోయారు. ఆ ఆశ్చర్యం ఎంతో సేపు నిలువలేదు వారు ఆశపడ్డట్లుగానే అదే వేడుకలో లఫర్తే ర్యాంప్ వాక్ చేస్తూ తన జాకెట్ విప్పేసి యద సౌందర్యాలను బహిర్గతం చేసింది. అంతే కాకుండా వాటిపై ‘చిలీలో టార్చర్ పెట్టి రేప్ చేసి చంపేస్తారు’ అని స్కెచ్ పెన్‌తో రాసుకుని వచ్చిందట.

 

ఇకపోతే దాదాపు నెల రోజులుగా చిలీలో ఆర్థిక అసమానత్వం, రాజకీయ సంక్షోభం సమస్యలు నెలకొన్నాయట. ఈ నేపథ్యంలో బాగా అల్లర్లు జరుగుతున్నాయని. ఈ అల్లర్లలో భాగంగా దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా. అల్లర్లకు పాల్పడిన వారిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని టార్చర్ పెట్టి రేప్ చేసి చంపేశారట. ఇలాంటి అల్లర్లకు నిరసనగా ఈవిడ ఈ చర్యకు పూనుకుందట. అసలే సమాజంలో ఉన్న మనుషుల మనసు నిండా కామకోరికలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఈవిడగారు ఇంకా చూడండని ఇలా చూపించడం నెటిజన్లకు నచ్చలేదట?  

మరింత సమాచారం తెలుసుకోండి: